Patanjali to 'shift' mega food park from Gr Noida బాబా రాందేవ్ కు ముఖ్యమంత్రి ఫోన్.. అన్ని తానై చూస్తానని హామీ

Yogi adityanath dials ramdev after patanjali scraps food park project in up

Baba Ramdev, Yogi Adityanath, Patanjali food park, Satish Mahana, Food Processing Secretary JP Meena, Patanjali food park in Greater Noida, Patanjali food park in Noida, Patanjali Ayurved, Yogi Adityanath government, BJP, Uttar pradesh

Uttar Pradesh Chief Minister Yogi Adityanath has spoken to yoga guru Baba Ramdev after Patanjali Ayurved Ltd announced that it is shifting the proposed Patanjali Food and Herbal Park from Greater Noida

బాబా రాందేవ్ కు ముఖ్యమంత్రి ఫోన్.. అన్ని తానై చూస్తానని హామీ

Posted: 06/06/2018 12:19 PM IST
Yogi adityanath dials ramdev after patanjali scraps food park project in up

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరి పట్ల యోగా గురు బాబా రాందేవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజకీయ ఒత్తిడిలు పనిచేశాయా.? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై నిర్మించ తలపెట్టిన మెగా ఫుడ్ పార్క్ ను కూడా తాము రద్దు చేసుకుని వేరే రాష్ట్రానికి తరలించాలని కీలక నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో అఘమేఘాట మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్.. బాబా రాందేవ్ తో ఫోన్ ద్వారా సంభాషించి సమస్యను పూర్తిగా తెలుసుకున్నారు. అంతేకాదు ఫుడ్ పార్క్ తరలిపోకుండా చర్యలు తీసుకున్న సీఎం.. ఆ యూనిట్ కు అవసరమైన అన్ని అంశాలను తానే స్వయంగా చూస్తానని కూడా హామీ ఇచ్చారు.

పతాంజలి ఫుడ్ పార్క్ తరలిపోవడం లేదని.. ఈ విషయంలో సీఎం యోగీ.. బాబా రాందేవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడారని రాష్ట్ర మంత్రి సతీష్ మహనా దృవీకరించారు. గ్రేటర్ నోయిడా పరిధిలోని సుమారు 455 ఎకరాల్లో నిర్మించాలని భావించిన భారీ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించనున్నట్టు 'పతంజలి ఆయుర్వేద' ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలను తీసుకున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాబా రాందేవ్ కు చెందిన పతాంజలి అయుర్వేద సంస్థకు.. అయుర్వేద ఉత్పత్తుల తయారీ కోసం ఈ భూమిని కేటాయించింది. కాగా, బాబా రాందేవ్ ఆ భూమిలో పతాంజలి అయుర్వేద సంస్థకు బదులు పతాంజలి ఫుడ్ పార్క్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి జేపీ మీనా దీనిని వ్యతిరేకించారు.

ఈ విధంగా పతాంజలి సంస్థ తమ ఇస్టానుసారంగా మార్పులు చేసుకునేందుకు వీలు లేదని, ఒక వేళ అలా చేయాలంటే.. మరోమారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంటుందని అక్షేపించారు. దీంతో గత కొన్ని నెలలుగా తాము చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని.. అందుకే తాము సంస్థను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బావిస్తున్నామని పతాంజలి సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి సతీష్ మహానా మాట్లాడుతూ.. ఇందుకు ప్రభుత్వంతో మరోమారు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. దీంతో పతాంజలి ఫుడ్ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles