good news to unemployed youth నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

Good news to unemployed youth age relaxation for jobs

vro posts, TSPSC Recruitment, TSPSC Jobs, TSPSC, Telangana Jobs, Telangana Job Notifications, telangana group 4 notification, Telangana Formation Day, group4, Age relaxation for group4 jobs, age limit relaxed for RTC jobs

The Telangana government gives good news to unemployed youth by relaxing age limit by ten years to group four jobs and RTC jobs.

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..

Posted: 06/05/2018 10:29 AM IST
Good news to unemployed youth age relaxation for jobs

నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురును అందించింది. తెలంగాణ రాష్ట్రావతరణ కానుకగా 2,786 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసిన ప్రభుత్వం.. ఉద్యోగ అశావహుల నుంచి వ్యక్తమవుతున్న విన్నపాన్ని కూడా పరిగణలోకి తీసుకుంది. ఈ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న తాము వయోపరిమితి విషయంలో సడలింపు ఇవ్వని పక్షంతో తాము అర్హత కోల్పోతున్నామంటూ.. పలువరు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వారి విన్నపంపై సానుకూలంగా స్పందించింది తెలంగాణ సర్కారు.

గ్రూప్ 4 పరిధిలోని పరీక్షలకు వయోపరిమితిని సడలించింది. ఏకంగా పదేళ్ల పాటు వయోపరిమితిని ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రూప్ 4 పోస్టులలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్‌-4, మండల ప్లానింగ్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు పదేళ్ల వయోపరిమితి సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి లెక్కింపునకు 01.07.2018 తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. తాజాగా వయోపరిమితి పెంచడంతో.. జనరల్‌ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగినట్లయింది.

దీనికి ఆయా రిజర్వేషన్లతో అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్లు, వికలాంగులకు 10 ఏళ్ల వరకు అదనపు వయో సడలింపు వర్తించనుంది. ఆర్టీసీలోని 72 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకుని జనరల్‌ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : age limit  relaxation  TSPSC  Group 4 jobs  RTC jobs  kcr  telangana  

Other Articles