TSRTC employees to go on strike సమ్మె సైరన్ మ్రోగించిన తెలంగాణ ఆర్టీసీ..

Telangana rtc employees to go on strike from june 11th

TSRTC, wage revision, strike, rtc employees, employee unions, telangana

After failing the talks with the management demanding wage revision Telangana RTC employee unions has given a call that they are going on strike from june 11th

సమ్మె సైరన్ మ్రోగించిన తెలంగాణ ఆర్టీసీ.. ఈ నెల 11 నుంచే..

Posted: 06/04/2018 08:16 PM IST
Telangana rtc employees to go on strike from june 11th

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. వేతన సవరణ డిమాండ్‌తో జూన్ 11 నుంచి నిరవధిక సమ్మెకు తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ) పిలుపునిచ్చింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ సంఘాల కేంద్ర కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నిరసనలు, నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సంస్థలో గుర్తింపు పొందిన ‘తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌(టీఎంయూ)’ నేతలు ఆర్టీసీ పరిపాలనా విభాగం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శివకుమార్ కు నోటీసు అందజేశారు.

ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్య పరిష్కారానికి ఆర్టీసీలోని అన్ని సంఘాలు కలిసిరావాలని కోరారు. నిరసనలో భాగంగా.. జూన్ 7 నుంచి సమ్మె సన్నాహకాలు ప్రారంభించనున్నారు. 7న ఎర్రబ్యాడ్జిలు ధరించి నిరసనలు, 8న ప్రాంతీయ కార్యాలయాల ముందు ఆర్టీసీ సంఘాలు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. జూన్‌ 11 నుంచి కార్మికులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSRTC  wage revision  strike  rtc employees  employee unions  telangana  

Other Articles