janasena kept a check on corruption: Pawan Kalyan జనసేన లేకపోతే ఊళ్లను దోచేసేవాళ్లు: పవన్ కల్యాణ్

Janasena pawan kalyan slams tdp and ycp in corruption

Jana sena, Pawan Kalyan, agrigold, tdp, agri gold assets, vizianagaram, saluru, uttarandhra porata yatra, vizianagaram bus yatra, srikakulam, YCP, TDP, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan slams tdp and ycp in corruption, says janasena stands by the victims of agri gold.

జనసేన లేకపోతే ఊళ్లను దోచేసేవాళ్లు: పవన్ కల్యాణ్

Posted: 06/02/2018 02:11 PM IST
Janasena pawan kalyan slams tdp and ycp in corruption

రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు వున్నారని, మధ్య, పేద తరగతికి చెందిన ప్రజలు తమ బిడ్డల భవిష్యత్తు కోసమని తినితినక.. చొమటోడ్చిన డబ్బును అగ్రిగోల్డ్ లాంటి సంస్థల ప్రచారాలను నమ్మి అందులో పెట్టుబడులు పెడితే.. వారిని లూటీ చేసిన అగ్రీగోల్డ్ సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా.? ఇందుకేనా ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసింది. ప్రజలకు ఆగ్రీగోల్డ్ అస్తులు దక్కేలా చేయాల్సిన ప్రభుత్వం.. నాలుగేళ్లుగా ఎందుకు తాత్సరం చేస్తుందని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అగ్రీగొల్డ్ బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తుందని అన్నారు. అలాగే ఆ సంస్థ ఆస్తులను చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో పోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్‌ మాట్లాడుతూ... ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని, వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, సరైన జీతభత్యాలు అందించాలని డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరుచుతామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను కూడా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలబడే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉండాలి కానీ, వారిని దోచుకునే ప్రభుత్వం ఉండకూడదని హితవు పలికారు. జనసేన పార్టీ కనుక ఆవిర్భవించకుంటే ఈ రెండు పార్టీలు కలిసి ఊళ్లను పంచుకుని ఉండేవని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ విషయాన్ని తలచుకుంటేనే భయమేస్తోందన్నారు. అవినీతి జరిగినట్టు నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు చేస్తున్నారని, లంచాలు తీసుకునే వారు రసీదులు ఇస్తారా? అని ప్రశ్నించారు.

స్థానిక టీడీపీ నేతలనూ పవన్ వదలిపెట్టలేదు. గిరిజనుడు కాని భాంజ్‌దేవ్‌ను టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారని పేర్కొన్న ఆయన, సాగునీటిని ఆయన చేపల చెరువులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువులకు మాత్రం నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ పోస్టులను సైతం టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 2019లో జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  YCP  TDP  Corruption  AgriGold  victims  AP SCS  andhra pradesh  politics  

Other Articles