తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా అవినీతి కనిపించిందా.? అవినీతి లేని పాలనను తమ పార్టీ దేశ ప్రజలకు అందిస్తుందని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటిస్తూ వెళ్తుంటే.. సొంతపార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చాడు. ప్రధానమంత్రికే కాదు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. తమ ప్రభుత్వం హాయంలో పెరిగిన అవినీతే తమను ప్రజలకు దూరం చేసిందని, ఉప ఎన్నికలలో ఓటమికి కూడా కారణం అదేనని ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపితో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అవినీతి పెరిగిందని ఎవరైనా విపక్షాల సభ్యులు వ్యాఖలు చేసివుంటే.. ఈ పాటికీ వారిని అనేక రకాలుగా విమర్శించే బీజేపి నేతలు సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన అరోఫణలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. 'అవినీతి' కారణంగానే కైరానా, నూర్పూర్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందంటూ హార్దోయ్ ఎమ్మెల్యే శ్యాంప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులు ప్రభుత్వంపై వ్యతిరేకత కలిగి ఉన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అవితీని పెరిగింది. ఇలాంటి బొలెడన్ని కారణాల వల్లే మేం ఓడిపోయాం' అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతటితో ఆగకుండా ఆరెస్సెస్ చేతిలో ప్రభుత్వ పగ్గాలున్నాయనీ, ముఖ్యమంత్రి కూడా నిస్సహాయుడిలా మారారని అర్ధం వచ్చేలా తన ఫేస్బుక్ పేజీలో ఒక పద్యం కూడా పోస్ట్ చేశారు. మోడీ పేరుతో పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందనీ... కానీ ప్రజల అంచనాలకు తగ్గట్టు పనిచేసి వారి హృదయాలను గెలుచుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ ఎమ్మెల్యే విమర్శించారు. మోడీ హవా కారణంగానే అధికారం దక్కించుకోగలిగినా ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేకపోయారని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more