తూత్తుకూడి బాధిత కుటుంబాలకు రజనీ ఓదార్పు.. anti-social elements infiltrated Thoothukudi violence: Rajnikanth

Miscreants and anti social elements infiltrated thoothukudi violence rajnikanth

Rajnikanth, Anti-Strelite protests, Tuticorin, Vedanta group, protests in Tuticorin, adani company, vedanta company, kamal hassan, dmk, stalin, palanisamy, panner selvam, tamil nadu

Stating that miscreants and anti-social elements had infiltrated the Thoothukudi violence, actor-turned-politician Rajnikanth on Wednesday appealed to Tamil Nadu government to contain them with iron hand.

బాధిత కుటుంబాలకు రజనీ ఓదార్పు.. రూ.26 లక్షల అర్థికసాయం ప్రకటన

Posted: 05/30/2018 03:26 PM IST
Miscreants and anti social elements infiltrated thoothukudi violence rajnikanth

తమిళనాడులోని తూత్తుకుడి బాధిత కుటుంబాలను తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ పరామర్శించారు. తూత్తుకూడిలోని స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో.. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపినఘటనలో 13 మంది మృత్యువాత పడిగా వారి కుటుంబాలను రజనీకాంత్ ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన వారికి అర్థిక సాయంగా తన వంతుగా ప్రతీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల సాయం అందిస్తానని ప్రకటించారు.

స్టెరిలైట్‌ కాపర్ ప్లాంట్ యజమానులు కూడా అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రసుత్తం వున్న పర్యావరణ అనుమతులతోనే వారు విస్తరణకు వెళ్లడంతో పాటు.. స్థానికుల విన్నపాలను పట్టించుకోకుండా నిర్ధయగా వ్యవహరించడంతోనే ఇంతటి ఘోరం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ పరిశ్రమ ఎప్పటికీ తెరచుకోవడానికి వీల్లేదని రజనీకాంత్ అన్నారు. ఈ ఆందోళనల్లో ప్రవేశించి విధ్వంసానికి కారణమైన అసాంఘిక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.

ఈ ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని, ఇంతటి అల్లర్లు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేకపోయారని అన్నారు. తూత్తుకుడిలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసని, వారికి సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను కొందరు రాజకీయం చేస్తున్నారని, అన్ని సమస్యలకు రాజీనామాలు చేయాలని మంత్రుల ముందు డిమాండ్‌ ఉంచడం పరిష్కారం కాదని రజనీకాంత్‌ అన్నారు. తూత్తుకుడి ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఉందని, అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్‌పై తనకు నమ్మకం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles