Pawan Kalyan slams TDP for ignoring healthcare వచ్చే ఎన్నికలలో తేల్చుకుందామా.? టీడీపీకి పవన్ సవాల్..

Pawan kalyan flays government for neglecting uttarandhra

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, Ranasthalam, rajam, pawan kalyan porata yatra, pawan kalyan public meeting, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan said that it would be TDP Vs Janasena in 2019 elections. He even challenged AP Chief Minister Chandra Babu Naidu that they would see during the elections.

వచ్చే ఎన్నికలలో తేల్చుకుందామా.? టీడీపీకి పవన్ సవాల్..

Posted: 05/29/2018 09:54 AM IST
Pawan kalyan flays government for neglecting uttarandhra

గత సార్వత్రిక ఎన్నికలలో తాను నమ్మిన పార్టీలకు అధికారం లభించేందుకు తాను రెండు తెలుగురాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పార్టీలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు దోహదపడితే.. అవసరం ముగియగానే తాను ఎవరో తెలియదని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే వ్యాఖ్యానించడం.. అందులోనూ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ వ్యాఖ్యలను చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బస్సుయాత్రలో భాగంగా రణస్థలం చేరుకున్న తరువాత, అక్కడ ప్రసంగిస్తూ.. స్థానికంగా వున్న టీడీపీ ధర్మపోరాట దీక్ష ఫ్లెక్సీని, అందులో కనిపిస్తున్న అశోక్ జగపతిరాజు ఫొటోను చూసి విమర్శలు గుప్పించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను విజయనగరం వెళ్లి, అశోక్ గజపతిరాజు కోసం ప్రచారం చేశానని, ఆయనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరానని, ఇప్పుడు హోదా గురించి అడిగే సరికి, నేను ఎవరో తెలియదని ఆయన అంటున్నారని నిప్పులు చెరిగారు. ఆయన వయసులో తనకన్నా పెద్దవారని, ఆయన పెద్దరికాన్ని తాను గౌరవిస్తున్నానని, ఆయనే దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. అభివృద్ధి పనులంటే ఒక్క అమరావతిని మాత్రమే చూస్తే సరిపోదని హితవు పలికారు. రాష్ట్రాభివృద్ధి కేవలం అవినీతిలో మాత్రమే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని డిమాండ్ చేసిన ఆయన ప్రజల సొమ్మును ప్రజల అరోగ్యాల కోసం ఖర్చుపెట్టడానికి ప్రభుత్వం ఎందకింతలా అలోచిస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు తన జేబులోని డబ్బులేమి ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వ ఖజానాలో వున్న ప్రజల డబ్బునే ఖర్చుపెట్టాలని అన్నారు. 50 గ్రామాల ప్రజలు ఆముదాలవలస - రాజాంల మధ్య బలశాల దగ్గర వంతెన కావాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజాంలో ప్రభుత్వ కాలేజీ లేదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు రాజాం అని కూడా గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

మీ అవినీతిని ప్రశ్నించినందుకు 15 మంది జనసేన సైనికుల్ని జైళ్లలో పెట్టారు. గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే మీరు చేసేది ఇదా? అంటూ మండిపడ్డారు. మీ అవినీతిని చూస్తూ సహించం... చొక్కాపట్టుకొని నిలదీస్తాం ఎంతమంది జనసైనికుల్ని మీరు జైల్లలో పెట్టిస్తారో కూడా చూస్తామని పవన్ సవాల్ విసిరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన జోస్యం చెప్పారు. సీఎం చంద్రబాబు రాజీపడటం వల్ల, ఆయన కాంట్రాక్టుల కోసం రాజీపడటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండాపోయిందని పవన్ అవేదన వ్యక్తం చేశారు.

స్పెషల్ ప్యాకేజికి రాజీపడి ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకువచ్చారు. యువత భవిష్యత్తుతో అడుకున్నారు.. రాష్ట్ర ప్రజలపై పన్నులబారం పడేలా చేశారు.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు.? మీరు మాత్రం రాజధాని నిర్మాణం పేరుతో ప్రత్యేక విమానాలు వేసుకుని దేశంకాని దేశానికి వెళ్లి విహారయాత్రలు చేసివచ్చారు. రాజధాని లేని రాష్ట్రమంటూ ప్రజల నుంచి విరాళాలు సేకరించిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలేంటి..? ప్రజలను రోడ్డున పడేయమేనా.? ఇదేనా, మీ 40 ఏళ్ల అనుభవం? ఇదేనా మీ అభివృద్ది..? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది.? అని పవన్ కల్యాన్ సూటిగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Ranasthalam  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles