DMK, allies call tamil nadu bandh on Friday రేపు తమిళనాడు బంద్ కు విపక్షాల పిలుపు

Dmk allies call bandh on friday against police firing on anti sterlite protesters

Sterlite protests, death toll, Tamil Nadu bandh, Thoothukudi, DMK, Sterlite copper plant, Sesa Sterlite, Vedanta, DMK, bandh, police firing, Sterlite, protesters, thootokudi, Tuticorin, Tamil Nadu,

The DMK and other opposition parties have called for Puducherry and Tamil Nadu bandh on Friday in light of the Sterlite protests in Thoothukudi

ఆత్మరక్షణ కోసమే కాల్పులన్న సీఎం.. రాష్ట్రబంద్ కు విపక్షం పిలుపు

Posted: 05/24/2018 02:51 PM IST
Dmk allies call bandh on friday against police firing on anti sterlite protesters

రాజకీయ పార్టీలు జోక్యం, సంఘ వ్యతిరేక శక్తులు రంగప్రవేశం చేసి తూత్తుకుడిలో ఆందోళనకారులను తప్పుదోవ పట్టించాయని.. శాంతియుతంగా జరుగుతున్న అందోళనను హింసాత్మకంగా మార్చారని.. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని తమిళనాడు సీఎం పళనిస్వామి ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారని ఆయన ప్రకటించారు. తమపై దాడి చేయడానికి దూసుకొస్తోన్న వారి నుంచి తమను తాము కాపాడుకోవాలని ఎవరైనా అనుకుంటారని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డీఎంకే సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు చెన్నైలోని అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో, స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు-డీఎంకే శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, అమాయకుల ప్రాణాలను తీసిన వారిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోందని విమర్శించారు. కనీసం ఘటనా స్థలానికి వెళ్లి, బాధితులతో మాట్లాడాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, డీజీపీ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది.

ఇక స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతొంది. తూత్తుకుడి జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో ఇంటికీ వెళ్లి యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు. యువతే కాల్పుల ఘటనకు కారణమయ్యారని ప్రభుత్వం భావిస్తుంది. వీరిని అదుపుచేస్తే అంతా సద్దుమణుగుతుందన్న భావనతో ప్రభుత్వం వుండగా, ఈ పరిసరాల్లో ఇదే మరోమారు ఉద్రిక్తతకు దారితీయవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితి నిగురుగప్పిన నిప్పులా వుందని కూడా పేర్కోంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  bandh  police firing  Sterlite  protesters  thootokudi  Tuticorin  Tamil Nadu  

Other Articles