ఉద్దానానికి ప్రభుత్వం ప్రాధాన్యత: పవన్ అరోపణలపై లోకేష్ Nara Lokesh Responds On Pawan Kalyan’s Comments On Uddanam Issue

Nara lokesh responds on pawan kalyan s comments on uddanam issue

Nara Lokesh, Pawan Kalyan, Janasena, Pawan Kalyan indefinite fast, Pawan Kalyan news, Pawan Kalyan updates, Pawan Kalyan about Uddanam kidney victims, Pawan Kalyan latest, Nara Lokesh news, Nara Lokesh updates, Nara Lokesh new, Nara Lokesh Responds On Pawan Kalyan’s Comments On Uddanam Issue

Andhra pradesh IT Minister Nara Lokesh responded on Pawan Kalyan’s comments on uddanam issue, says govt has done a lot in four months and a lot is remaining for doing.

ఉద్దానానికి ప్రభుత్వం ప్రాధాన్యత: పవన్ అరోపణలపై లోకేష్

Posted: 05/24/2018 11:11 AM IST
Nara lokesh responds on pawan kalyan s comments on uddanam issue

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ ఉద్ధానం కిడ్నీ బాధితుల అంశంలో ప్రభుత్వానికి రెండు రోజుల డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో పవన్ అరోపణలపై అంధ్రప్రదేశ్ ఐటీ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకొచ్చారని.. దీంతో సీఎం దానిపై దృష్టి పెట్టి పలు కార్యక్రమాలను చేపట్టామని ఆయన అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ... గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తాను తాగునీటి సమస్య తీర్చాలనే ఉద్దేశంతోనే ఉద్ధనంపై శ్రద్ధ తీసుకున్నానని తెలిపారు.

శ్రీకాకుళంలో కిడ్నీ సమస్యల బారిన పడిన ఏడు మండలాల్లోని 80 గ్రామాలు వున్నాయని, అయితే వీరందరికీ 238 హ్యబిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. గత నాలుగు నెలల్లో ఏకంగా లక్ష మంది స్థానికులకు కిడ్నీ వ్యాధి స్ర్కీనింగ్ టెస్టులు కూడా నిర్వహించామని చెప్పారు. సీకేడి రోగులనందరినీ డయాలసిస్ కోసం ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలకు పంపుతామన్నామని చెప్పారు. రోగులకు నెలవారీగా రూ.2500 పెన్షన్ కూడా అందజేస్తున్నామని చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఉద్ధానం విషయంలో విమర్శలు చేస్తున్నారని అన్నారు.  

అక్కడ ఎన్టీఆర్‌ సుజల పథకం కింద ఈ ఏడు మండల్లాలో ఏడు అర్వో మదర్ ప్లాంట్ ను 109 రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్లను కూడా పూర్తి చేశామని, మరో 29 త్వరలో పూర్తి కానున్నాయని లోకేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి నియోజక వర్గానికి వెళ్లాల్సిన ప్లాంట్లను వెంటనే ఉద్ధానానికి తరలించి అక్కడ ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం కొంత సమయం పట్టిందని, ప్రస్తుతం నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. డయాలిసిస్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే వీటితో సమస్య పూర్తిగా సమసిపోలేదని, చేయాల్సింది ఇంకా వుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles