మాది పారదర్శక పాలన.. మా హయాంలో ఎక్కడైనా అవినీతి కనిపిస్తుందా.? అవినీతి ఎక్కడ, ఎలా, ఏ రూపంలో వున్నా దానిని సహించం.. అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు చేసే ప్రసంగాలు, చెప్పే మాటలకు వాస్తవిక రూపానికి మాత్రం ఏ విధమైన పోలిక లేదని వస్తున్న అరోపణల్లు నిజముందా.? అంటే అవుననే అంటున్నాయి సర్వే ఫలితాలు. పాలకులు మాటలు కోటలు దాటు.. కానీ చేతలు అన్న నానుడికి అద్దం పడుతున్నాయి అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, లంచగొండితనం అంశాలకు సంబంధించి 'సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్' నిర్వహించిన సర్వేలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. ఇటీవల సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సెన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అది ఏకంగా తెలంగాణలో అవినీతి, లంచగొండితనం ఏ స్థాయిలో వుందో, ఏ స్థాయి అధికారుల నుంచి ఎక్కడి వరకు పాకిందో కూడా అద్దంపడుతుంది. ఈ క్రమంలో సీఎంఎస్ నిర్వహించిన సర్వేలో కూడా అలాంటి విస్మయం గొలిపే నిజాలే బహిర్గతమయ్యాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రం తమిళనాడు అవినీతిలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, తెలంగాణ రెండో స్థానంలో, అంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో వున్నాయి. ప్రభుత్వ సేవలకు లంచాలు చెల్లించడంలో ప్రజల స్వీయానుభవాల ఆధారంగా తెలంగాణ 2, ఏపీ 4వ స్థానంలో ఉన్నాయి. 13 రాష్ట్రాల్లోని మొత్తం 11 రకాల పౌరసేవలపై అధ్యయనం జరిపిన సీఎంఎస్ ఈ మేరకు 'అవినీతి అధ్యయన నివేదిక-2018' రూపొందించింది. 'అవినీతి' రాష్ట్రాల జాబితాలో పంజాబ్ 3వ స్థానంలో, గుజరాత్ 5వ స్థానంలో ఉన్నాయి. కాగా, మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఏడాది రూ. 2500 నుంచి రూ.2800 కోట్లు వివిధ పౌర సేవలకు ప్రజలు లంచం ఇచ్చారని సర్వే తేల్చింది.
ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో అవినీతి పెరిగిందని 13 శాతం మంది, తగ్గిందని 34 శాతం మంది, యథాతథంగా ఉందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 73 శాతం మంది తాము అవినీతికి బాధితులమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెరిగిందిన 72 శాతం మంది, తగ్గిందని 14 శాతం మంది, యథాతథంగా ఉందని 14 శాతం మంది చెప్పారు. 13 శాతం మంది బాధితులమని వెల్లడించారు.2005తో పోలిస్తే 2018లో ఏపీ, తెలంగాణలో పౌరసేవల్లో అవినీతి తగ్గినట్లు పేర్కొంది. ఇక.. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తెలంగాణ 5వ స్థానంలో, ఏపీ చివరి స్థానంలో ఉన్నట్లు నివేదిక వివరించింది.మొత్తం మీద చూస్తే.. తెలంగాణలో అవినీతి తగ్గిందని ప్రచారం జరుగుతున్నా.. ఏమాత్రం తగ్గలేదు. ఏపీలో అవినీతి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ అవినీతి ఉందనే ప్రచారం జరుగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more