Thunderstorm warning in Delhi, Rajasthan, UP, Haryana హెచ్చరికో.. హెచ్చరిక.. ఇది వాతావరణ హెచ్చరిక

Imd issues fresh alert severe dust storm hits delhi thunderstroms in many states

Indian Meteorological Department, lighting, lightning strikes, lightning network, thunderstorms, gusty winds, Rajasthan, Uttar Pradesh, Delhi, Telangana, Andhra Pradesh, Weather, Weather Forecast, WeatherUpdate, rain

Thunderstorms and gusty winds are likely to hit several northern India states, including Rajasthan, Uttar Pradesh, Delhi and in many states on Tuesday and wednesday according to the India Meteorological Department (IMD).

హెచ్చరికో.. హెచ్చరిక.. ఇది వాతావరణ హెచ్చరిక

Posted: 05/08/2018 01:35 PM IST
Imd issues fresh alert severe dust storm hits delhi thunderstroms in many states

వాతావరణ కేంద్రం అధికారులు దేశ ప్రజలను అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరీ ముఖ్యంగా ఇవాళ సాయంకాలం నుంచి 48 గంటల పాటు దేశ ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. మునుపెన్నడూ లేని విధంగా వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా.. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

మరీ ముఖ్యంగా ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలను ఉరుములు, గాలితో కూడిన వడగళ్ల వానలు ముంచెత్తనున్నాయంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని కూడా సూచించారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా, కేరళ, సిక్కిం, జార్ఖండ్, యూపీ, త్రిపుర, మిజోరామ్, మణిపూర్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, మేఘాలయా, అసోం, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

దీంతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాధిలోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో వాయువేగంతో కూడిన ఇసుక తుఫాను మరోమారు తన పంజాను విసేందుకు సిద్దంగా వుందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. సాయంత్రం ఐదు గంటల తరువాత నుంచి ఏడు గంటల వరకు ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.

అత్యవసర సేవల్లోని వారిని అందుబాటులో ఉండాలని ఆదేశించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి వర్షం సమయంలో బయటకు రావద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోరారు. ఒకవేళ వర్షంలో చిక్కుకుపోతే కాంక్రీటు భవనాలనే ఆశ్రయించాలని సూచించారు. వారం క్రితం గాలిదుమారంతో కూడిన వానలతో 124 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles