Sumanth attends court on cheque bounce case మార్కాపురం కోర్టుకు హాజరైన సుమంత్

Actor sumanth attends markapuram court on cheque bounce case

Actor Sumanth, nephew of Akkineni Nagarjuna, supriya niece of Nagarjuna, co producer, Markapuram Magistrate Court, Prakasham District, cheque bounce case, naruda donarudaa, tollywood, movies, entrtainment

Actor Sumanth, nephew of Akkineni Nagarjuna, has attended Malkapuram Magistrate Court, Prakasham District in connection with a cheque bounce case.

మార్కాపురం కోర్టుకు హాజరైన నటుడు సుమంత్

Posted: 05/04/2018 10:57 AM IST
Actor sumanth attends markapuram court on cheque bounce case

అక్కినేని నటవారసత్వంతో తెలుగుతెరకు పరిచయమై పలు హిట్ చిత్రాలలో నటించిన అక్కినేని నాగార్జున మేనల్లుడు హీరో సుమంత్ ఇవాళ మార్కాపురం న్యాయస్థానంలో హాజరయ్యాడు. తన సోదరి సుప్రియ తో ఫాటు ఆయన ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. 'నరుడా డోనరుడా' సినిమాకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో వారు కోర్టుకు హాజరయ్యారు.

ఈ ఇద్దరూ కలిసి జాన్ సుధీర్ తో కలిసి 'నరుడా డోనరుడా' సినిమాను నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిలువలేకపోయింది. చిత్రం పరాజయం పాలైన క్రమంలో ఆశించిన వసూళ్లు రాకపోవడంతో వారు పలువురికి ఇచ్చిన కమిట్ మెంట్లకు గాను చెక్కులను జారీ చేశారు. ఈ క్రమంలోఈ సినిమాకు ఫైనాన్స్ అందించిన ఫైనాన్షియర్ తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో వారిని పలుమార్లు కోరినా ప్రతిస్పందన కరువైంది. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

కాగా, ఫైనాన్షియర్ పిటీషన్ నేపథ్యంలో మార్కుపురం మెజిస్ట్రేటు కోర్టు వీరికి పలుమార్లు న్యాయస్థానానికి హాజరుకావాల్సిందిగా సమన్లను పంపింది. అయితే వారు అందకు ప్రతికూలంగా స్పందించి న్యాయస్థానానికి హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం వారిపై వారెంట్లు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో వారు కోర్టుకు హాజరుకావాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇక సుమంత్, సుప్రియలు కోర్టుకు రావడంతో వారెంట్లను రీకాల్ చేసిన న్యాయమూర్తి పఠాన్ షియాజ్, కేసును జూన్ 28కి వాయిదా వేశారు. కాగా, త్వరలోనే డబ్బు సర్దుబాటు చేస్తామని ఫైనాన్షియర్‌తో కూడా వారు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor  Sumanth  Akkineni Nagarjuna  Markapuram Court  cheque bounce case  naruda donarudaa  Prakasham  

Other Articles