30 killed in rajasthan due ot high-intensity dust storm 30 మందిని బలితీసుకున్న ఇసుక తుఫాను

30 killed as high intensity squall wreaks havoc in parts of rajasthan

High-speed dust storm, Indian Meteorological Department, dust storm in Bharatpur, dust storm in Alwar, dust storm in Dholpur districts, sandstorm, squall, killed, injured, rajasthan dust storm, natural calamity, disasters

High-speed dust storm wreaked havoc on Wednesday night in Rajasthan’s Bharatpur, Alwar and Dholpur districts leaving at least 30 people dead and over 100 injured.

ITEMVIDEOS: ప్రకృతి ప్రకోపం: భారీ ఇసుక తుఫానుకు 30 మంది మృతి

Posted: 05/03/2018 12:35 PM IST
30 killed as high intensity squall wreaks havoc in parts of rajasthan

ప్రకృతి ప్రకోపం తమపై పంజా విసరడంతో.. రాజస్థాన్ లోని ఈశాన్య జిల్లాల ప్రజలు విలవిలలాడారు. ముంచుకొస్తున్న మృత్యువు తమ వాళ్లను కబళిస్తున్నా.. తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో నిశ్చేష్టులగా మారారు. తమ కళ్లముందే తమ కుటుంబసభ్యులు, ఇరుగుపోరుగువారు అర్థనాధాలు పెడుతున్నా.. అదుకోలేని నిస్సహాయస్థితిలోకి నెట్టివేయబడ్డ తమ పరిస్థితిని దిగమింగుకోలేకపోతున్నారు. ప్రకృతి విలయం.. వలయంలా తమను చుట్టుముట్టగా.. సుమారు 30 మంది బలయ్యారు. వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు.

రాజస్థాన్ ప్రకృతి ప్రకోపం ఇసుక తుపాను రూపంలో ప్రజలను కబళించింది. ఈ రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన భరత్ పూర్, ధోల్ పూర్, అల్వార్, శ్రీగంగానగర్ జిల్లాల్లో వాయువేగానికి ఇసుక కూడా తోడై  దుమ్మెత్తిపోసింది. ఆకాశాన్ని దుమ్ము, ధూళి కమ్మేసింది. తీవ్రమైన గాలులతోపాటు దుమ్ము ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం అర్థరాత్రి తర్వాత అకస్మాత్తుగా వచ్చిన ఇసుక తుఫాన్ ఈశాన్య రాజస్థాన్ లో బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఇసుక ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై వాహనాల్లో వెళ్లే వారికి ముందు, వెనక ఏమీ కనిపించలేదు. గాలులతోపాటు ఇసుక వచ్చి పడుతుండటంతో ప్రమాదాలు జరిగాయి.

తీవ్రమైన గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ఇసుక తుఫాన్ ధాటికి భరత్ పూర్ ఒక్క జిల్లాలోనే 11 మంది చనిపోయారు. కరెంట్ లేదు.. నీటి సరఫరా కూడా నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్ మెంట్లలోకి కూడా దుమ్ము వచ్చి చేరింది. చిన్న చిన్న ఇళ్లు అయితే మట్టికొట్టుకుపోయాయి. హాటళ్లు, చిరు వ్యాపారులు అయితే ఈ ఇసుక తుఫాన్ దెబ్బకి తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం 22 మంది చనిపోయారని.. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రాజస్థాన్ ప్రభుత్వం కూడా వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరో రెండు రోజులు ఇలాంటి ప్రకృతి విలయాలు ఉండొచ్చని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High-speed dust storm  sandstorm  squall  killed  injured  rajasthan  natural calamity  disasters  

Other Articles