RBI May Help Solve The Cash Crunch Puzzle ప్రజల పాత అలవాట్లతోనే కరెన్సీ కష్టాలు: అర్బీఐ

Indians revert to old habit of hoarding cash at home

cash crunch, RBI, Rama Rao, panjagutta, dlf, bank ATM, Axis Bank ATM, Reserve Bank of India (RBI), Demonetisation, Notes ban, currency shortage, cash shortage, currency circulation, ATMs cash crunch

Reserve Bank of India released data showing that people were still hoarding cash as withdrawals outpaced spending.

ప్రజల పాత అలవాట్లతోనే కరెన్సీ కష్టాలు: అర్బీఐ

Posted: 04/26/2018 02:54 PM IST
Indians revert to old habit of hoarding cash at home

దేశప్రజలు అచరిస్తున్న పాత పద్దతులు, విధానాలే నోట్ల కష్టాలకు కారణాలను అర్బీఐ తాజాగా వెల్లడించింది. 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేపట్టిన క్రమంలో ప్రజలు ఎదుర్కొన్న కరెన్సీ కష్టాలు అరు మాసాలైన తరువాత కానీ మళ్లీ వ్యవస్థ గాడిలో పడలేదు. అయితే అడపాతడపా తమ ఉనికిని చాటుకునేందుకు రెడీ అవుతున్న కరెన్సీ కష్టం.. మళ్లీ విజృంభించింది. తన కోరలను ఎక్కడికక్కడ చాచడంతో దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రజలు మళ్లీ నోట్ల రద్దు నాటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం నగదు కొరకతి పెను సంక్షోభంగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కరెన్సీ నోట్లను ముద్రించే పేపర్ లేదని ఓ వైపు వార్తలను లీక్ చేసిన అర్బీఐ.. తాజాగా కరెన్సీ కష్టాలకు దేశ ప్రజల పాత విధానాలను అవలంభించడమే కారణమని స్పష్టం చేసింది. ఇంతకీ ఆ పాత పద్దతి ఏంటని అడగుతున్నారు కదూ.. గతంతో బ్యాంకులు శాఖోపశాఖలుగా లేనప్పడు, ప్రైవేటు బ్యాంకులు కూడా తమ ఉనికిని చాటుకోని కాలంలో ప్రజల తమ డబ్బును తమ ఇళ్లలతోనే పథిళంగా దాచుకునేవారు. అయితే ఇప్పడు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతూ.. కరెన్సీ కష్టాలకు కారణమవుతున్నారని అర్బీఐ అభిప్రాయపడింది.

ఏప్రిల్ 20తో ముగిసిన వారంలో తాము చలామణిలోకి పంపిన నగదంతా విత్ డ్రా అయిందని చెప్పింది. మొత్తం 16.34 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని, మొత్తం మూడు వారాల వ్యవధిలో 59.52 వేల కోట్లు విత్ డ్రా అయ్యాయని తెలిపింది. వాస్తవానికి ప్రజలు విత్ డ్రా చేసుకున్న డబ్బులు వారం పదిరోజుల్లో తిరిగి సర్క్యులేషన్ లోకి వస్తాయని, కానీ కొత్త నోట్లు తిరిగి బ్యాంకులకు రావడం లేదని తెలిపింది. ఇంట్లో సాధ్యమైనంత ఎక్కువ డబ్బు దాచుకోవాలని భావిస్తున్న వారి కారణంగానే ఇది జరుగుతోందని తెలిపింది.

ఇక మొత్తం జనవరి - మార్చి త్రైమాసికంలో 1.40 లక్షల కోట్ల డబ్బు విత్ డ్రా అయింది. 2016 తొలి మూడు నెలలతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. మొత్తం మీద చలామణిలో 1.89 లక్షల కోట్లు ఉందని, ఇందులో అత్యధిక మొత్తం ఇళ్లలో ఉందని అంచనా వేసింది. కాగా, ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్య ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నగదు కొరత తీవ్రంకాగా, నిరంతరాయంగా కొత్త నగదు ముద్రించి పంపామని ఆర్బీఐ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles