Pawan Kalyan calls it TDP's conspiracy వరుస ట్విట్లతో పాలకులను, మీడియాను ప్రశ్నించిన పవన్

Pawan kalyan talks about sri reddy s abusive rant calls it tdp s conspiracy

pawan kalyan, janasena, pawan kalyan ram gopal varma, pawan kalyan fans, pawan kalyan ravi prakash, pawan kalyan srini raju, pawan kalyan nara lokesh, pawan kalyan chandrababu, pawan kalyan tweets, pawan kalyan mother, sri reddy, pawan kalyan on sri reddy controversy, pawan kalyan on sri reddy, sri reddy pawan kalyan news, pawan kalyan twitter posts, andhra pradesh, politics

Tollywood star Pawan Kalyan has posted a series of tweets reacting to actor Sri Reddy's remarks against him.”If I cannot defend the honour of my mother I better die..“, Pawan has titled his posts that he posted on his Twitter page.

‘నా తల్లిని తిట్టించింది ఈ ముగ్గురే’: ఫోటోలను ట్వీట్ చేసిన జనసేనాని పవన్

Posted: 04/20/2018 11:10 AM IST
Pawan kalyan talks about sri reddy s abusive rant calls it tdp s conspiracy

ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో  ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ..  ధర్మపోరాట దీక్షలో పాల్గోన్నమని వచ్చిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ధర్మ పోరాట దీక్షలో రాష్ట్రం మేలు గురించి పోరాడాలని మీరు అడిగారని అందుకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రానికి మేలు జరగాలని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేశానని.. అయితే.. మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేయిని వెనకమాలుగా మీడియా శక్తులతో నరికించేంతటి వారని తెలియదని.. కానీ ఇప్పుడు అర్థమైందని పవన్ అవేదన వ్యక్తం చేశారు.

మీరు ధర్మపోరాట దీక్షకు రమ్మనారు.. కానీ మిమ్మల్ని ఎలా నమ్మటం? మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీకు అండగా నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం... ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ని వేదికగా చేసుకుని నారా లోకేష్ అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత ఆరునెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ-9, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, మహా టీవి సహా ఇతర కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియా ద్వారా తనపై మీద, తన కుటుంబం మీద, తనను అభిమానించే వారి మీద నిరవధిక అత్యాచారం జరిపారు, జరుపుతున్నారని అరోపించారు.

అందులో భాగంగా గత కొద్ది రోజులుగా (పది కోట్ల డబ్బు ఖర్చుపెట్టి మరీ) తనకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డు మీద అసభ్యంగా పచ్చిబూతులు తిట్టించి, దానిని పదేపదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి, దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ లో పెట్టి.. ఇప్పుడు మీ పిలుపుని ఎలా తీసుకోవాలి? వర్మ అనే దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (టీవీ9 ఓనర్) ఐన శ్రీనిరాజు (పదికోట్లు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 రవిప్రకాశ్ (మీడియా డిజైన్) వీరు ముగ్గురి ద్వారా మీ అబ్బాయి అయిన లోకేష్, అతని స్నేహితుడైన కిలారు రాజేష్ కలిసి చేస్తున్నది మీకు తెలియదంటే నమ్మమంటారా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.

మీడియాను ప్రజల పక్షం వదిలి.. పాలక పక్షానికి బానిసైందని పవన్ ఆక్షేఫించారు. ఇన్విస్టిగేటివ్ జర్నలిజం చేసి.. ప్రాణాలను తృణప్రాయాలుగా వదిలిన, వదులుతున్న జర్నలిస్టులు వున్న సమాజంలో.. కేవలం ఎల్లో జర్నలిజాన్ని పెంచిపోషించే కొన్ని మీడియా ఛానళ్లు తన తల్లిపై ప్రయోగించిన అభ్యంతరకర భాషని పదేపదే ప్రసారం చేసిన వార్తను ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లేదా ప్రతిపక్షనేతల తల్లిపై కూడా వాడి ఉంటే మీ మీడియా సంస్థలు ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని సూటిగా ప్రశ్నించారు. కనీసం బాలకృష్ణ తల్లిపై అలాంటి పదప్రయోగం చేసినా, మీ మీడియా ఛానెల్స్ ప్రసారం చేసే ధైర్యం చేసేవా?’ అని నిలదీశారు.

కేవలం పవన్ కల్యాణ్ తల్లి, ఎవరికీ, ఏనాడూ అపకారం తలపెట్టని తన తల్లిపై వాడిన అసభ్యకరమైన భాషను మాత్రం పదేపదే టెలీకాస్ట్ చేసి, దానిపై విశ్లేషణలు, చర్చలు చేపట్టడేమా జర్నలిజం అంటే.. ఇదేనా ఒక జర్నలిస్టుగా మీకున్న బాధ్యత.. సభ్యతా, సంస్కారం అంటూ సమాజాన్ని మార్పు దిశగా పయనింపజేస్తామని చెప్పి అసభ్యపదజాలాన్ని మీ టీవీ ఛానెల్ లో పదే పదే ప్రసారం చేయడమేనా మెరుగైన సమాజమంటే అంటూ పవన్ పరోక్షంగా టీవీ9ను ప్రశ్నించారు. ఏ టీవీ ఛానెల్, ఏ పత్రికా కూడా ఇలాంటి అసభ్యపదజాలాన్ని వినియోగించరాదు, ప్రసారం చేయరాదన్న విలువలు తెలిసి కూడా మీరు ఎలా చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు చెప్పండి శక్తిమంతమైన, ధనిక మీడియా శక్తులారా? పవన్ కల్యాణ్ కే ఈ ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ ఎందుకు?’ అని ఆయన నిలదీశారు.

వరుస ట్విట్లతో విరుచుకుపడిన పవన్ కల్యాన్.. ఇక రాంగోపాల్ వర్మ, మీడియా కలసి చేసిన చర్యలను ఆయన ఎండగడుతూ మరో ట్విట్ లో..  'మీకు చదువులు ఉండి, విజ్ఞత ఉండి, కుటుంబాలు ఉండి, అక్కాచెల్లెళ్లు ఉండి, కోడళ్లు, కూతురులు ఉండి పేరు ప్రఖ్యాతలు ఉండి, సంపదను కూడబెట్టుకొని అన్నింటికి మించి సమజాన్ని ప్రభావితం చేసే స్థాయిల్లో (మీడియా) మాధ్యమాలల్లో ఉన్న మీరు అందరు కలిసి ఒక దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన మహిళను, భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియని నా కన్నతల్లిని... ఎవరికి ఉపకారం తప్ప అపకారం అనేది ఆలోచనల్లో కూడా చెయ్యని నాకు జన్మనిచ్చిన తల్లిని అసభ్య పదజాలంతో తిట్టిస్తారా.? అంటూ ప్రశ్నించారు. ఆ తరువాత తన తల్లిని తిట్టించిన త్రయం ఫోటోలను కూడా పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. వారిలో టీవీ9 రవిప్రకాశ్, శ్రీని రాజు, రామ్ గోపాల్ వర్మల ఫొటోలున్నాయి.

‘మీరందరు కలిసి నడిరోడ్డులో ఏ కొడుకు కూడా వినకూడని ఒక తప్పుడు పదాన్ని అనమని సలహాలు చెప్పి, అనిపించి, దానిని పదే పదే ప్రసారం చేసి, ఆ తర్వాత దానిపైన డిబేట్లు చేసే స్థాయికి మీ స్థాయి వ్యక్తులు ఇంత దిగజారగలిగినప్పుడు... "అసిఫా" లాంటి ముక్కుపచ్చలారని పసిపిల్లలను, అభం శుభం తెలియని పసిపిల్లలపై దారుణమైన అత్యాచారాలు చేసే నీచులు నికృష్టులు ఎందుకు ఉండరు? కొల్లలుగా ఉంటారు... మీరందరు కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా... మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రులకి, మీ అక్కచెల్లెళ్లకు, మీ కూతురులకి, కోడళ్ళకి మీ ఇంటిల్లిపాదికి నా హృదయపూర్వక వందనాలు' అంటూ పవన్ ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan  janasena  chandrababu  nara lokesh  ravi prakash  ram gopal varma  andhra pradesh  politics  

Other Articles