CM Palaniswamy alleges Former CS on Jayalalithaa's health: ‘జయలలిత’ అరోగ్యంపై సీఎస్ తప్పుడు సమాచారం: సీఎం

Former chief secretary gave wrong info on jayalalithaa s health cm palaniswamy

palaniswamy, jayalalithaa, aiadmk, former chief secretary, Rama Mohana Rao, Wrong Information, Cauvery issue, social media

Tamil Nadu chief minister K Palaniswami today accused former chief secretary P Rama Mohana Rao of providing wrong information about late chief minister J Jayalalithaa's health.

‘జయలలిత’ అరోగ్యంపై సీఎస్ తప్పుడు సమాచారం: సీఎం

Posted: 04/16/2018 11:01 AM IST
Former chief secretary gave wrong info on jayalalithaa s health cm palaniswamy

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత ఆరోగ్యంపై మాజీ చీఫ్ సెక్రటరీ పి. రామ్మోహన్‌ రావు రాష్ట్ర ప్రజలకు, నేతలకు తప్పుడు సమాచారం అందించారని ముఖ్యమంత్రి పళనిస్వామి అరోపించారు. చెన్నై విమానాశ్రయంలో మీడియావర్గాలతో మాట్లాడిన ఆయన జయలలిత ఆకస్మిక మరణం విషయంలో మాజీ సీఎస్ రామమోహన్ రావు పాత్రపై అరోపణలు గుప్పించారు. ఈ విషయంలో రామ్ మోహన రావు ఎవరినో కాపాడేందుకు ప్రయత్నించారని అన్నారు. ఎవరినో కాపాడేందుకు.. మాజీ సీఎస్ ఏకంగా అమ్మ జయలలిత అరోగ్య విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కోన్నారు.

అయితే మాజీ ప్రధాన కార్యదర్శి రామా మోహన రావు ఎవరిని కాపాడేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేశారన్నది మాత్రం ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించలేదు. ఆ వేరొకరు ఎవరు అన్నది వెల్లడించలేదు. ఇక ప్రస్తుతం తమిళనాడు ప్రజల్లో కాకరేపుతున్న అంశం కావేరి నదీ జలాలు. దీనిపై ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ.. కేంద్రం కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయడంలో వివక్ష చూపుతుందన్న అగ్రహ ప్రజల్లో రగుతున్న నేపథ్యంలో దీనిపై కూడా సీఎం పళనిస్వామి స్పందించారు.

కావేరీ నదీ జలాల ఆందోళన సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్‌, ట్విటర్‌ ద్వారా పరిష్కారం కాదని తెలిపారు. చట్టపరంగా వెళితేనే సమస్య మంచి పరిష్కారం కనగొనుగు గలుగుతామని చెప్పారు. కావేరీ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందిస్తూ మే 3 కల్లా కేంద్రం ముసాయిదాను రూపొందించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి మెమో అందజేశానని పళనిస్వామి చెప్పారు. కాగా, కావేరి సెగతో రాష్ట్రంలో ప్రజల అగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్న తరుణంలో.. అమ్మ జయలలిత అంశాన్ని తెరపైకి తీసుకోచ్చి.. అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం సాగుతుందన్న అరోపణలు కూడా వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles