telugu actor held under theft case for breaking into houses విలాసాలు, వ్యసనాలతో దొంగగా మారిన నటుడు

Telugu actor held under theft case for breaking into houses

telugu actor robbery case, telugu actor theft case, telugu actor nagaraj robbery case, guntur narendra, huzurnagar actor arrested, suryapet district, actor theft case, actor breaking into houses, rachakonda police

telugu actor nagaraj, alias narender, srikanth, guntur narendra, from huzurnagar of suryapet district, held under theft case for breaking into houses since three years by rachakonda police

విలాసాలు, వ్యసనాలతో దొంగగా మారిన నటుడు

Posted: 04/11/2018 11:20 AM IST
Telugu actor held under theft case for breaking into houses

అతను స్వతహాగా కార్పెంటర్. కానీ సినిమాల్లో నటించాలన్న మోజుతో హైదరాబాద్ కు వచ్చి.. బుల్లితెరలో వచ్చే సిరియళ్లలో చిన్న చిన్న వేషాలు వేసస్తూ నటుడిగా కొద్దిగా గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. అయితే అప్పుడే అతని దృష్టి వేరే వాటిపైకి మారింది. స్నేహితులతో జూదరం అడటం, మద్యం సేవించడం వంటి వ్యసనాలపైకి మనసు లాగింది. ఇంకేముంది విలాసాలు, జల్సాలు కోసం అతని అదే మార్గం పట్టాడు. క్రమంగా షూటింగ్ అవకాశాలు కూడా పోయాయి. దీంతో తన వ్యససాలను తీర్చుకోవడం కోసం ఏకంగా దొంగగా మారాడు.

తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేయడం ప్రారంభించాడు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్లుగా ఇదే అతని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎంతటి దొంగైనా ఒకరోజు కటకటాలు లెక్కించాల్సిందే అన్న విషయాన్ని మర్చినా.. పోలీసుల చట్రం నుంచి మాత్రం తప్పించుకోలేక పోయాడు. నటుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి రూ.22లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.

సూర్యాపేటజిల్లా హుజూర్ నగర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన బర్రి నాగరాజు అలియాస్‌ నరేందర్‌ అలియాస్‌ శ్రీకాంత్‌ అలియాస్‌ గుంటూరు నరేంద్ర(23) వృత్తిరీత్యా కార్పెంటర్‌. సినిమాలో నటించాలనే కోరికతో హైదరాబాద్‌ వచ్చి జూబ్లీహిల్స్‌లోని ఇందిరానగర్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద ఉంటున్నాడు. ఓ ప్రైవేట్‌ తెలుగు టీవీ సీరియల్‌లో చిన్న చిన్న క్యారెక్టర్‌లు వేస్తున్నాడు. జూదం, సిగరెట్‌, మద్యానికి బానిసయ్యాడు. తన వ్యసనాలను తీర్చుకోవడం కోసం దొంగతనాల దారిని ఎంచుకున్నాడు. నగరంలోని చైతన్యపురి, సరూర్‌నగర్‌ ప్రాంతాలను తన దొంగతనాలకు కేంద్రాలుగా ఎంచుకున్నాడు.

ఉదయం రెక్కీ నిర్వహించి, రాత్రిపూట కటింగ్ ప్లేర్‌, స్ర్కూడ్రైవర్ ను జేబులో పెట్టుకుని రెక్కీ నిర్వహించిన ఇళ్లను టార్గెట్ చేసి.. తాళాలు పగలగొట్టి.. ఇంట్లోని విలువైన అభరణాలు దొచుకెళ్తాడు. ఇలా ఏకంగా చైతన్యపురి పరిధిలో 16, సరూర్ నగర్‌ పరిధిలో ఒకటి, మొత్తం17 ఇళ్లను దోచాడు. చైతన్యపురి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం 17 దొంగతనాలు తానే చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 72.5 తులాల బంగారు ఆభరణాలను స్వాదీనం చుసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles