Wife Not a Chattel, Husband Can't Force Her to Live with Him Says SC భర్తలకు దిమ్మదిరిగే షాకిచ్చిన సుప్రీంకోర్టు..

Wife not a chattel husband can t force her to live with him says sc

Supreme court, marriage, Divorce, Indian Penal Code, IPC, New Delhi, Husband, Wife, SC, divorce cases, matrimonial judgements, 498a, husband wife cruelty act, supreme court of India

A wife is not a "chattel" or an "object" and she cannot be forced to reside with her husband even if the man desires to live with her, the Supreme Court has said.

తస్మాత్ జాగ్రత్తా: భర్తలకు దిమ్మదిరిగే షాకిచ్చిన సుప్రీంకోర్టు..

Posted: 04/09/2018 12:22 PM IST
Wife not a chattel husband can t force her to live with him says sc

తన మొగుడు తనకే సొంతం అని అనుకునే హక్కు, అధికారం భార్యలకు వున్నా.. తన భార్య తనకే సొంతం అనే హక్కు, అధికారాలు మాత్రం భర్తలు లేవు. కొట్టినా.. తిట్టినా..వంటింట్లోనే పడుండాలి.. గడప దాటి బయటకు వెళ్లకూడదన్న భర్తల అదేశాలు ఇకపై చెల్లవు.. నమ్మశక్యంగా లేదా... కానీ ఇది ముమ్మాటికీ నిజం. భర్తలకు షాకిచ్చేలా.. భర్తల నరనరాల్లో జీర్ణంచుకుపోయిన మగాడు, మొగుడు అన్న అహంకారం పటాపంచలయ్యేలా బహుచక్కగా స్పష్టం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. పురుషాధిక్య సమాజంలో మహిళలకు కూడా స్వేఛ్చను కల్పించింది.

భార్య అస్తి కాదు, వస్తువూ కాదు.. తనతోనే కలసి వుండాలని బలవంతం చేస్తే కూడా కదరదు అంటూ దేశఅత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది భార్యలను వేధిస్తున్న భర్తలకు దిమ్మదిరిగే తీర్పు. అనునిత్యం వేధిస్తూన్న తన భర్తతో కలసి వుండలేనంటూ ఓ బాధిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన భర్త తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నా.. తాను మాత్రం అతనితో కలసి అడుగులు వేయలేనని ఆమె కోర్టుకు తెలిపింది. అందుకు అతని నిత్యవేధింపులే కారణమని కూడా న్యాయస్థానం ఎదుట స్పష్టం చేసింది.

దీనిపై జస్టిస్ మదన్ బిలోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ... ‘‘ఆమె ఆస్తి కాదు. ఆమె నీతో కలసి జీవించాలనుకోవడం లేదు. మరీ ఆమెతో కలసి ఉండాలని ఎలా చెబుతావు?’’ అంటూ బాధితురాలి భర్తను ప్రశ్నలతో కడిగేసింది. ఆమె కలసి జీవించేందుకు ఇష్టంగా లేకపోవడంతో మరోసారి పునరాలోచించుకోవాలని కోర్టు సూచించింది. అయితే, ఆమెను ఒప్పించేందుకు అవకాశం ఇవ్వాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అదే సమయంలో విడాకులు ఇప్పించాలని బాధుతురాలి తరఫు న్యాయవాాది కోరారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme court  marriage  498a  Husband  Wife  cruelty act  chattel  object  legal affairs  

Other Articles