Not the best of times to be a banker:SBI chief బ్యాంకుల ప్రైవేటీకరణపై ఎస్బీఐ చీఫ్ సన్నాయినొక్కులు..

Sbi chief rajnish kumar says not the best of times to be a banker

Rajnish Kumar,State Bank of India,RBI,SBI, RBI, PNB, Essar Steel, Arcelor, good future, bad times, indian markets, National Company Law Tribunal,Essar Steel,SBI,ArcelorMittal-Nippon,Vedanta,Numetal-JSW Steel,Bhushan Steel

Rajnish Kumar, Chairman, State Bank of India (SBI), admitted that it is not the best of times to be a banker, but is optimistic about the future

బ్యాంకుల ప్రైవేటీకరణపై ఎస్బీఐ చీఫ్ సన్నాయినొక్కులు..

Posted: 04/07/2018 03:44 PM IST
Sbi chief rajnish kumar says not the best of times to be a banker

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరిణ చేయడం ద్వారా.. అవి ఏర్పడిన సామాజిక లక్ష్యాల సాధనకు విఘాతం కలుగుతుందని అంటూనే.. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ఈ లక్ష్యాలను అన్నింటినీ కేవలం భారతీయ స్టేట్ బ్యాంకు ఒక్కటే నెరవేర్చలేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ నర్మగర్భవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అనుకూలంగా ఆయన సన్నాయి నోక్కులు నోక్కారు. అయితే, ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ఇది సరైన సమయం కాదని కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను ముందుగా ఆర్థికంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన తర్వాత విక్రయిస్తే బావుంటుందన్న అభిప్రాయపడ్డారు. ఇక అలా చేయాల్సిన అవసరం ఏంటో ఉదాహరించిన ప్రముఖుల వాదనలతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించేశారు. ఎయిర్ ఇండియా మాదిరిగా పూర్తిగా అప్పుల్లో మునిగి పోకముందే ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని సహా పలువురు ప్రముఖులు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎస్ బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ ఈ అంశంపై స్పందించారు.

అయితే ప్రైవేటీకరణకు ప్రస్తుతం సరైన సమయం కాదని.. బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరో రెండేళ్ల సమయం పడుతుందదని ఆ తరువాత బ్యాంకింగ్ రంగంలోని ప్రభుత్వరంగ స్ంస్థ బ్యాంకులను పూర్తిగా ప్రైవేటీకరణ చేయవచ్చునన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రంగ బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల పీఎన్ బీలో స్కామ్ వెలుగుచూసిన తర్వాత ప్రైవేటీకరణ అంశంలో మార్కెట్లు సానుకూలంగా లేవని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అర్థికంగా అకర్షిణీయంగా తయారైతేనే వాటికి సరైన ధర వస్తుంద అని రజనీష్ కుమార్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajnish Kumar  chairman  SBI  RBI  PNB  Essar Steel  Arcelor  good future  bad times  indian markets  

Other Articles