pawan kalyan says its the first step agitation for AP special status ప్రత్యేక రాష్ట్ర హోదా సాధనకు ఇది తొలి అడుగే: పవన్ కల్యాణ్

Pawan kalyan says its the first step agitation for ap special status

pawan kalyan, janasena, vijayawada, amaravati, cpm madhu, cpi rama krishna, benz circle, ramavarappadu, AP capital, Pawan Kalyan Political Yatra, pawan kalyan press meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan says marching on national highway was the first step in his agaitation for AP special status, which had immense responce from AP people

ప్రత్యేక రాష్ట్ర హోదా సాధనకు ఇది తొలి అడుగే: పవన్ కల్యాణ్

Posted: 04/06/2018 02:30 PM IST
Pawan kalyan says its the first step agitation for ap special status

ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమాలు చేయాలన్నది తన ఉధ్దేశ్యం కాదని, అయితే అవిధంగా తనను ఉసిగొల్పుతున్నారని జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. తమ ఉధ్యమాల వల్ల సామాన్య ప్రజానికానికి ఎలాంటి అవరోధం కలగవద్దని యోచిస్తానని అయన అన్నారు. నాయకులు అమ్ముడుపోతారేమో, కానీ ప్రజలు, ప్రజా నాయకులు మాత్రం అమ్ముడుపోరని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఇవాళ తాము జరిపిన పాదయాత్ర కేవలం తొలి అడుగు మాత్రమేనని.. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకపోతూ మలి అడుగులలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని మరింత తీవ్రవైన ఉద్యమాలను రూపొందిస్తామని చెప్పారు. రానున్న రెండు వారాల్లో మరిన్ని ప్రజాఉధ్యమాలు నిర్వహిస్తామని చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హదాను కల్పించడంతో పాటు విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ.. వామపక్షాలతో కలసి తొలిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి జాతీయ రహదారులపై శాంతియుతంగా పాదయాత్ర చేసిన జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్ విజయవాడలోని బెంజీ సర్కిల్ నుంచి రామవరప్పాడు వరకు ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న ప్రధాని, అధికారంలోకి వచ్చిన తరువాత హోదా విషయాన్నే మర్చిపోయారని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే నిధులనే మన రాష్ట్రానికి ఇచ్చి దాని పేరును మాత్రమే మార్చరని అన్నారు. విభజన హామీలు కేంద్రం అమలు చేస్తుందని కొన్నాళ్లు వేచిచూశామని అయినా ఫలితం లేకపోవడం వల్లే తాను ప్రశ్నించడం ప్రారంభించానని చెప్పారు.

కేంద్రం ఇచ్చించి పాచిపోయిన లడ్డూలని తాను అంటే.. హోదా కన్నా అవే మాకు ముద్దు అని ప్యాకేజీకి సీఎం చంద్రబాబు ఒప్పుకుని సమర్దించారని పవన్ విమర్శఇంచారు. ఇవాళ్ల మళ్లీ మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారని విమర్శించారు. కేంద్రంపై పోరాడటంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని పవన్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై తిరుపతిలో జరిగిన పార్టీ సభలో తొలిసారిగా తానే మాట్లాడానని, ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు డిమాండ్ చేయాలని కూడా కోరానని పేర్కోన్నారు.

ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతోందని స్పష్టం చేశారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని, అయితే దానివల్ల ఫలితం లేకపోయిందని అన్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అశించిన స్థాయిలో పని చేయడం లేదని విమర్శించారు. ఆయనది కేవలం ప్రాంతీయ అభివృద్ది మాత్రమేనని పవన్ విమర్శఇంచారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ఎవ్వరూ మాట్లాడడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు.

చంద్రబాబు నుంచి మళ్లి పిలుపు వచ్చింది

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై చర్చించేందుకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తనకు, తన పార్టీకి మళ్లీ పిలుపు వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు.  రెండేళ్ల క్రితం లేదంటే కనీసం ఒక ఏడాది క్రితం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బాగుండేదని అన్నారు. ఇప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం వల్ల..  ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని ప్రశ్నించారు.

కాబట్టి ముందు చంద్రబాబు నాయుడు తమ మంత్రులతో కూర్చొని ప్రణాళిక వేసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయని, ఇక మున్ముందు పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళదామనుకుంటున్నారో చంద్రబాబు స్పష్టత తెచ్చుకోవాలని హితవు పలికారు. ఆ తరువాత వారి మనసులో ఏముందో తమకు తెలియజేస్తే, వారు పోరాడాలనుకుంటోన్న విధానంపై తాము యోచించి, వారితో కలిసి పోరాడతామా? లేదా? అనే విషయంపై తాము చెబుతామని అన్నారు. కాగా, తాము జేఎఫ్‌సీ నివేదిక రూపొందించిన కారణంగానే టీడీపీ, వైసీపీలపై ఒత్తిడి పెరిగిందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వరకు దారి తీసిందని పవన్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles