chairman snaps at Rajya Sabha MPs over disruptions లోక్ సభలో మారని ఎంపీల తీరు.. సభ్యులపై మండిపడ్డ వెంకయ్య

Rajya sabha adjourned till 2 pm following uproar lok sabha adjourned for the day

Lok Sabha, Government of India, Parliament of India, Mahajan, Motion of no confidence, Adjournment, Speaker of the Lok Sabha, Sumitra Mahajan, Rajya Sabha, Chairman Venkaiah Naidu, Cauvery river, Ananth Kumar, Congress, AIADMK, Speaker, Mallikarjun Kharge, congress, bjp, TDP, YCP, politics

Agitated by repeated disruptions in the Rajya Sabha, Chairman Venkaiah Naidu lashed out at the members of the Upper House and said that the patience of the country is being tested. Lok Sabha was adjourned for the day as AIADMK MPs trooped into the Well.

లోక్ సభలో మారని ఎంపీల తీరు.. రాజ్యసభలో సభ్యులపై మండిపడ్డ వెంకయ్య

Posted: 04/04/2018 12:24 PM IST
Rajya sabha adjourned till 2 pm following uproar lok sabha adjourned for the day

మలి విడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా నిష్పలంగా మారుతున్నాయి. అధికారంలో వున్న కేంద్రం.. పార్లమెంటు సమావేశాలనే సజావుగా సాగేట్లు చూడటం లేదని ఇక వీరికి దేశాన్ని అభివృద్ది పథకంలో ఎలా పయనింపజేస్తారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అందోళన చేస్తున్న సభ్యులతో చర్చలు నిర్వహించి.. వారిని సమాధాన పర్చాల్సిన భాధ్యత పార్లమెంటు వ్యవహారాల శాఖా మంత్రితో పాటు స్పీకర్, కేంద్ర ప్రభుత్వంపై వుందని.. అయినా వారు తమపై అవిశ్వాస తీర్మాణాలను పలు విపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన క్రమంలో తప్పించుకునేందుకే ఇలా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఇక కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి వున్నా కేంద్ర ప్రభుత్వం అందోళన చేస్తున్న ఎంపీలకు సంయమనం పాటించాలని, వారి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని వారికి నమ్మకం కలిగించే ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సాగలేదని విమర్శలు కూడా కేంద్రం ఎదుర్కొంటుంది. గత మార్చి 5న ప్రారంభమైన మలివిడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తొలివారం పర్వాలేదనిపించినా.. ఆ మరుసటి వారం నుంచి పభలో ఎంపీల నిరసనలు.. ఆ తరువాత అవిశ్వాస తీర్మాణాలు తెరపైకి రావడంతో.. కేంద్రం తప్పించుకునే ప్రయత్నంలోనే తమవారైన అన్నాడీఎంకే ఎంపీలతో సభలను స్థంభింపజేస్తున్నారన్ని విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇవాళ కూడా ప్రారంభమైన లోక్ సభ సమావేశాలలు షరామామూలుగానే అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లోకి దూసుకువచ్చి.. కావేరి నదిజలాలపై వాటర్ బోర్డును ఏర్పాటు చేయాలని.. ఈ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన అదేశాలను పాటించాలని డిమాండ్ చేశారు. దీంతో సభ ప్రారంభం కాగానే రెండు నిమిషాల్లోపే గంట పాటు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో పలు బిల్లులను పాస్ అయిన తరువాత.. అవిశ్వాస నోటీసుల అందాయని.. దీంతో వీటిని ఇచ్చినవారికి కనీస సంఖ్యా బలం వుందో లేదో చూడాలని అందుకు సభ సజావుగా సాగాల్సిన అవసరముందని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు.

అయితే అమె మాటలను అన్నాడీఎంకే ఎంపీలు పట్టించుకోకుండా వెల్ లో పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అవిశ్వాస నోటీసులపై చర్చ కు అనుకూల వాతావరణం లేదంటూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలో మాత్రం కొత్తగా సభలోకి అడుగుపెట్టిన పలు రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం తరువాత ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్ లోకి వెళ్లి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తక్షణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపికి వ్యతిరేకంగా తామిచ్చిన అవిశ్వాస నోటిసుపై చర్చజరపాలని డిమాండ్ చేశారు.

దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మలివిడత బడ్జెట్ సమావేశాలలో సభ ఎలాంటి బిల్లులను ప్రవేశపెట్టలేదని.. దేశానికి అభివృద్ది కావాలంటే బిల్లులు అమోదం పొందాలని కూడా చెప్పారు. అసలు పార్లమెంటులో ఏం జరుగుతుందని, ఎందుకని సభలు వాయిదా పడుతున్నాయని యావత్ దేశ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కీలకమైన అవినీతి వ్యతిరేక బిల్లు కూడా అమోదం పొందాల్సి వుందన్నారు. కనీసం ఈ బిల్లునైనా అమోదించేలా సభ్యులు సహకరించాలని కోరారు. అయినా సభ్యుల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles