India withdraws sweeping rule on 'fake news' ఫేక్ న్యూస్ చర్యల విషయంలో వెనక్కు తగ్గిన మోడీ సర్కార్

Pmo withdraws controversial fake news circular after media uproar

Fake news, Information and Broadcasting Ministry, Narendra Modi, Media, Journalists, PMOm PM Modi, Smriti Irani, Journalists

A day after it brought out a set of stringent measures to deal with fake news, the I&B ministry withdrew them on Tuesday, after the PMO directed the same.

ఫేక్ న్యూస్ చర్యల విషయంలో వెనక్కు తగ్గిన మోడీ సర్కార్

Posted: 04/03/2018 07:44 PM IST
Pmo withdraws controversial fake news circular after media uproar

నకిలీ వార్తలను పత్రికల్లో ప్రచురించడం, టీవీల్లో ప్రసారం చేయడం వంటి చర్యలకు పాల్పడితే అందుకు బాధ్యులైన‌ జర్నలిస్టులపై తీసుకునే చర్యలకు సంబంధించిన బిల్లును తీసుకువచ్చేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఈ తరహా చర్యలకు కేంద్రం పూనుకోవడం ప్రతికాస్వేఛ్చకు భంగం కలిగించడమేనని దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నుంచి వ్యతరేకత ఉత్పన్నం కావడంతో.. మోడీ సర్కార్ వెనక్కుతగ్గింది. సరిగ్గా ఎన్నికల సంవత్సరంలో ఇలాంటి చర్యలకు పూనుకుని మీడియాతో దూరం పెంచుకోవడం సహేతుకం కాదన్న పలువురు రాజకీయ మిత్రపక్షాలు కూడా సూచించాయని సమాచారం.

ఇక దీంతో పాటు కేంద్రమంత్రుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా జర్నలిస్టులు తప్పుడు వార్తలను రాసిన పక్షంలో వారిపై చర్యలు తీసుకునే అంశంలో పలువురు ప్రముఖ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో చర్చించిన తరువాత అందిరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని.. కేంద్రం ఈ చర్యలను ఉపసంహరించుకుందని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. జర్నలిస్టులకు పత్రికాస్వేచ్ఛ కల్పించాలన్న ఆయావర్గాల సంఘాల నేతలతో ఏకీభవించిన కేంద్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వివరించారు.

అయితే అంతకుముందు తప్పుడు వార్తలను రాసిన పక్షంలో సదరు జర్నలిస్టు అక్రెడిటేషన్ ర‌ద్దు చేయాల‌ని కేంద్ర సమాచార శాఖ నిర్ణ‌యం తీసుకుంది. త‌మ‌కు ఏదైనా ఒక వార్త నకిలీది అని ఫిర్యాదు వస్తే వాటిని ప్రింట్ మీడియా అయితే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు, ఎలక్ట్రానిక్ మీడియా అయితే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్‌కు రిఫర్ చేస్తామని పేర్కొంది. ఆయా సంస్థ‌లు 15 రోజుల్లో ఈ ఫిర్యాదులపై విచారణ పూర్తి చేస్తాయ‌ని, ఆ స‌మ‌యంలో జర్నలిస్ట్ అక్రెడిటేషన్ సస్పెన్షన్‌లో ఉంటుందని, ఆ వార్త  త‌ప్పని తేలితే చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్పింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్ప‌డితే ఆరు నెలలు, రెండోసారి మ‌ళ్లీ ఫేక్ న్యూస్ రాస్తే ఏడాది పాటు, మూడవ‌సారి ఉల్లంఘ‌న‌ అయితే శాశ్వతంగా అక్రెడిటేషన్ రద్దు చేస్తామని తేల్చి చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles