Centre asked to file plea over AP Reorganisation Act 4ఏళ్లుగా విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదూ.?

Centre asked to file plea over ap reorganisation act on ponguleti petition

supreme court, Andhra Pradesh, Maninder Singh, Telangana, parliament, Gwalior, ponguleti sudhakar reddy, congress, justice A.K. Sikri, justice Ashok Bhushan, Centre

The Supreme Court asked the Centre to file its response on a plea seeking direction for proper implementation of the Andhra Pradesh Reorganisation Act that led to the bifurcation of the state. A bench of Justices A.K. Sikri and Ashok Bhushan asked the Centre what it had done in four years since the bifurcation.

విభజన హామీలను ఎందుకు నెరవేర్చలేదూ.? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

Posted: 04/02/2018 01:36 PM IST
Centre asked to file plea over ap reorganisation act on ponguleti petition

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని తాము నాలుగేళ్లుగా కోరుతున్నా.. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సమాధానాలు రావడం లేదని విమర్శిస్తూ..  దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఇప్పటివరకు అటు ప్రభుత్వాల మధ్యన, ఇటు పార్టీ నేతల మధ్యక ఇక పార్లమెంటు ఉభయ సభలకు మాత్రమే పరిమితమైన ఈ అంశం ఇక న్యాయస్థానానికి చేరింది. ఈ మేరకు కాంగ్రెస్ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ.. తాజాగా సుప్రీంలోని జస్టిస్ సిక్రీ, జస్టిస్ అశోక్ భూషన్ల నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తన పిటీషన్ సమర్పించారు.

నాలుగేళ్ల కాలంలో ఇప్పటి వరకు పలు సందర్భాలలో తాను న్యాయస్థానం అశ్రయించానని, ఈ మేరకు తాను పిటీషన్లు దాఖలు చేశాయని పేర్కోన్న ఆయన వాటిపై కూడా కేంద్రం నుంచి స్పందన కరువైందని పిటీషన్ లో పేర్కోన్నారు. దీంతో నాలుగేళ్లు గడిచిపోయినా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ సిక్రీ ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. గతంలో జారీ చేసిన నోటుసులపై ఎందుకు స్పందించలేదని కూడా నిలదీసింది. తాజా పిటీషన్ నేపథ్యంలో తమకు నాలుగు వారాల గడువును ఇవ్వాలని కేంద్రం కోరగా, నాలుగువారాల్లో వివరణ ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని సుప్రీం ధర్మాసనం అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles