Jails overcrowded up to 600 times: SC slams states ఖైదీల విడుదలపై సుప్రీంకోర్టు సీరియస్..

Release prisoners if you cannot keep them properly orders supreme court

Indian jails, Supreme Court, SC, prisoners in jails, National Legal Services Authority, Justice Madan B Lokur, Justice Deepak Gupta, prisoners human rights

Criticising the apathy of states and UTs toward prisoners' human rights in overcrowded jails, the Supreme Court warned DGs of prisons of contempt of court action if they failed to submit plans within two weeks. which were packed to 150% of their capacity.

ఖైదీల విడుదలపై ‘సుప్రీం’ సీరియస్.. చర్యలకు 2 వారాల గడువు..

Posted: 03/31/2018 03:01 PM IST
Release prisoners if you cannot keep them properly orders supreme court

దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లు సామర్థ్యానికి మించి ఖైదీలతో కిక్కిరిసిపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రభుత్వాలపై అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఖైదీల మానవ హక్కుల విషయంలో ఇంత అలసత్వమేంటని సూటిగా ప్రశ్నించింది. జైళ్లలో ఖైదీల రద్దీని తగ్గించేందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని రెండు వారాల్లోగా నివేదించాలని అదేశాలను అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల జైళ్ల డైరెక్టర్ జనరళ్లను హెచ్చరించింది.

జైళ్ల నిర్దిష్ట సామర్థ్యానికి మించి 150 శాతం మేర అధికంగా ఖైదీలతో కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కోర్టు ఈ మేరకు కన్నెర్ర చేసింది. ఓ జైలులో ఏకంగా 609శాతం మేర అధికంగా ఖైదీలు వున్నారని తెలియడంతో సుప్రీం అవి బంజరదొడ్లుగా భావిస్తున్నారా.. అంటూ మండిపడింది. రెండు వారాల్లోగా జైళ్లలోని ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వెల్లడించాలని అదేశించిన అత్యున్నత న్యాయస్థాన దర్మాసనం.. అలా చేయని పక్షంలో జైళ్ల డీజీలు సుప్రీంకోర్టు అదేశాల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న కోణంలో విచారణను ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పింది.

ఖైదీల రద్దీని తగ్గించేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని మే 6, 2016లో జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన సర్వోన్నత న్యాయస్థానం ద్విసభ్య ధర్మాసనం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అదేశాలను జారీ చేసింది. అయితే ఇందకు ఏ రాష్ట్రం నుంచి కూడా స్పందన రాకపోవడంతో  ప్రభుత్వాల అలసత్వాన్ని ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. రెండు వారాల్లోగా ఈ ప్రణాళికను రూపోందించని పక్షంలో కంటెప్ట్ అఫ్ కోర్టు కింద జైళ్ల డీజీలు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

"ఇది అత్యంత దురదృష్టకరం. ఖైదీల మానవ హక్కుల విషయంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పూర్తిస్థాయి నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతోంది. అంతేకాక అండర్ ట్రయల్ సమీక్ష కమిటీలు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడంలో వైఫల్యం చెందాయని స్పష్టమయింది" అంటూ ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఖైదీల మానవ హక్కులపై ఈ కేసులో సుప్రీంకోర్టుకి న్యాయ సలహాదారు (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న గౌరవ్ అగర్వాల్‌ సంధించిన ప్రశ్నకు రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, పంజాబ్, గోవా, మధ్యప్రదేశ్, అసోం, బీహార్ రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles