Amit Shah 'heckled' over anti-Dalit remarks by Minister Hegde కర్ణాటకలో ఒంటరిగానే పోరు.. పోత్తుల్లేవ్: అమిత్ షా

Amit shah says narendra modi s policies more pro dalit than that of congress

Lingayats, reservations, Dalits, Karnataka Elections, mysuru, PM Modi, Amit shah, siddaramaiah, chief minister, karnataka, congress

BJP national president Amit Shah on Friday distanced his party from Union minister Anantkumar Hegde’s statement on amending the Constitution during election campaign in Karnataka. Read more at: //economictimes.indiatimes.com/articleshow/63550609.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

కర్ణాటకలో ఒంటరిగానే పోరు.. పోత్తుల్లేవ్: అమిత్ షా

Posted: 03/31/2018 12:58 PM IST
Amit shah says narendra modi s policies more pro dalit than that of congress

కర్ణాటక రాష్ట్రంలో ప్రచారంలో ముందంజలో దూసుకుపోతున్న బీజేపి.. ఆ మేర ప్రజాదరణను మాత్రం సాధించలేకపోతుంది. అందుకు పార్టీ నేతల టంగ్ స్లిప్ అవ్వడం ఓ కారణం కాగా, దానిని తన చతురతతో అధిగమించాలని ప్రయత్నం చేసిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. అవును నేను తప్పు చేశాను.. కానీ కన్నడీగులు తప్పు చేయరు అని చెప్పడం కూడా కాంగ్రెస్ తమ ప్రచారంగా మలుచుకుంది. తప్పులు చేస్తూ.. వాటిని అంగీకరించి.. మళ్లీ తప్పులు చేసే వారికే ఓటేయమని ఎలా అడుగుతున్నారంటూ కారాలు మిరియాలు నూరుతుంది.

దీంతో కర్ణాటకలో కమలాన్ని మళ్లీ వికసింపజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ అక్కడే తిష్టవేసిన అమిత్ షా మాత్రం.. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని... తమ పార్టీ ఒంటిరిగానే అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ... బీజేపీ గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు.

రాష్ట్ర ప్రజల నాడి తెలుసుకున్నామని, అవినీతితో వారు విసిగిపోయారని, అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి లేకుండా కాంగ్రెస్ ఉండలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సరిగా లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. లింగాయత్ లకు మైనార్టీ హోదా ఇవ్వడం ఓ రాజకీయ కుట్ర అని... లింగాయత్ ఓట్లను చీల్చేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles