Paytm sharing your data with Chinese partner? పేటీయం కూడా డాటాను విక్రయిస్తుందా.?

Paytm sharing your data with chinese partner

Paytm, data security, Aadhaar, aadhar number, RBI, Unique identity number, Chinese company, Alibaba Group, Ant Financial, Nandan Nilekani

Aadhaar number, the insistence of it by government and private entities and potential threat of data theft continues to be a hotly debated topic in legal, At this juncture, customers of digital payments app Paytm have alleged that the firm is forcing them to share their 12-digit unique ID.

ఇప్పుడిక పేటీఎంతో జాగ్రత్తా.. డాటాను చైనాకు అమ్ముతుందా..?

Posted: 03/29/2018 02:53 PM IST
Paytm sharing your data with chinese partner

ఆధార్ సామాన్యుడి హక్క.. అంటూనే సామాన్యుల వ్యక్తిగత గోప్యతతో కేంద్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలకు, పాస్ పోర్టులకు, బ్యాంకు అకౌంట్లను, చివరకు అస్పత్రులలో అడ్మిట్ అయ్యేందుకు కూడా వినియోస్తున్న క్రమంలో అధార్ విశ్వసనీయతపై దేశ ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఓ వైపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. తమ తుదీ తీర్పు వెలువరించే వరకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయడానికి ఎలాంటి తుది గడువు లేదని తీర్పును వెలువరించిన తరువాత కూడా.. అధార్ ను పరిగణలోకి తీసుకుంటున్నాయి ప్రైవేటు అన్ లైన్ సేవా సంస్థలు.

అందులో డీమానిటైజైషన్ నుంచి ప్రాచూర్యంలోకి వచ్చిన పేటీయం సంస్థ, అ సంస్థకు అనుబంధంగా వున్న ఫ్రీ చార్జ్ సంస్థలు కూడా వినియోగదారులు తప్పనిసరిగా తమ అధార్ నెంబరును జతచేసి తమ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలను కూడా భర్తీ చేయాలని కోరుతుంది. అయితే ఫ్రీ చార్జ్ మాత్రం మరో అడుగు ముందుకేసి.. అధార్ నెంబరు కాకుండా ఓటరు ఐడీ కార్డు, ప్యాన్ కార్డుతో తమ వివరాలను అసుసంధానం చేయాలని కూడా కోరుతున్నాయి. దీంతో ఆదార్ విషయంలో ఓ వైపు అత్యున్నత న్యాయస్థానమే తీర్పును వెలువరించే వరకు అగాలని అదేశాల నేపథ్యంలో ఈ హాడావుడి ఎందుకుని పలువరు ప్రశ్నిస్తున్నారు.

ఇక పేటీయం మాత్రం ఆధార్ తో లింక్ చేసుకుంటే రూ. 200 క్యాష్ బ్యాక్ ఇస్తుండటం పేటీఎంపై అనుమానాలు తలెత్తేలా చేస్తోంది. పేటీఎం తన కస్టమర్ల వివరాలను చైనా సంస్థలతో పంచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేటీఎంకు వన్97 అనేది మాతృసంస్థ. పేటీఎంకు సంబంధించిన వివరాలన్నీ ఈ సంస్థ సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సంస్థకు మరికొన్న విదేశీ సంస్థలతో సంబంధం ఉందనే వాదన ఉంది. మరోవైపు చైనాకు చెందిన అతిపెద్ద సంస్థ అలీబాబాకు పేటీఎంలో 40 శాతం వాటాలు ఉన్నాయి. దీంతో, అలీబాబా సంస్థతో పేటీఎం తన కస్టమర్ల వివరాలను పంచుకుంటోందనే అనుమానాలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారుల వివరాలను దేశం దాటించకూడదు. అయితే, ఈ నిబంధన పేటీఎం బ్యాంకుకు వర్తింస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles