YCP MPs ready to resign for Andhra Pradesh special status హోదా కోసం రాజీనామాకు రెడీ అంటున్న వైసీపీ..

Ycp mps ready to resign for andhra pradesh special status

YCP MPs resign, Mekapati Rajmohan Reddy, YS jagan, Parliament sine die, AP special status, YSRCP, TDP, Andhra pradesh, politics

As per his earlier instructions of YSRCP chief YS Jagan, MPs would resign for their post on April 6th, but to the latest development, if parliament budget session go for sine die without discussion on AP special status, MPs would resign on that day.

హోదా కోసం రాజీనామాకు రెడీ అంటున్న వైసీపీ..

Posted: 03/26/2018 04:08 PM IST
Ycp mps ready to resign for andhra pradesh special status

అవిశ్వాసతీర్మానంపై చర్చ జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని, చర్చ జరగాలనే తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఒకవేళ తమ అవిశ్వాస తీర్మాణాన్ని చర్చకు రానీయకుండగానే పార్లమెంట్ ఉభయసభలను ముగిసినట్లు ప్రకటించిన పక్షంలో అదే రోజున తమ ఎంపీలు రాజీనామాలు చేయాలని తమ అధినేత జగన్ అదేశించారని మేకపాటి తెలిపారు. తమ ఎంపీలందరూ స్పీకర్ ఫార్మాట్ లో తాము రాజీనామాలు చేస్తారని కూడా ఆయన చెప్పారు. అయితే టీడీపీ ఎంపీలు కూడా తమతో పాటుగా రాజీనామాలు చేయాలని ఆయన కోరారు.

అంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజల తరుపున ఒక్క ఎంపీ కూడా పార్లమెంటుకు వెళ్లకుండా 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే.. హోదా ఇవ్వాలన్న ఒత్తిడి కేంద్రప్రభుత్వంపై పడుతుందని మేకపాటి అన్నారు. లేని పక్షంలో దేశ ప్రజలకు మంచి సంకేతం వెళ్తుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని, వైఎస్ జగన్ మొదటి నుంచి ఒకే మాట చెబుతున్నారని, ప్రత్యేక హోదా కోసం తాము నిరంతరం పోరాడుతూనే ఉన్నామని మేకపాటి అన్నారు.

అవిశ్వాసం పెడతామని తాము కనిగిరి సభలో ప్రకటించగానే, ‘అవిశ్వాసంతో ఏమవుతుంది?’ అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారని అన్నారు. మార్చి 15 తాము అవిశ్వాసం నోటీస్ ఇస్తే.. తమ దారిలోకి.. చంద్రబాబు వస్తున్నారని అన్నారు. అవిశ్వాసం విషయంలో అన్ని పార్టీలను తాము కలిశామని, కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ తమకు మద్దతు తెలిపాయని చెప్పారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా ప్రత్యేక హోదా సాధనలో విఫలమైందని, తమకు 20 మంది ఎంపీలను ఇస్తే కచ్చితంగా హోదా సాధించి తీరుతామని, హోదా సాధన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడమని మేకపాటి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles