devotees throng to temples on sri Rama Navami సీతారాముల కళ్యాణం చూతము రారండీ..

Devotees throng to temples on sri rama navami arragments made for sri rama kalyanam

sri rama navami, bhadradri, vantimitta, Sri Rama Kalyanam, devotess in ramalayams, sri rama jayam, tirumala temple, tiru vidhulu, arrangments

world wide hindu devotees celebrating sri rama navami celebrations today at the nearest temples, mainly in telugu states at badhadri ramaiah temple and vanmitta temple all arrangements made for sri rama kalyanam on the occasion of sri Rama Navami.

సీతారాముల కళ్యాణం చూతము రారండీ..

Posted: 03/26/2018 08:25 AM IST
Devotees throng to temples on sri rama navami arragments made for sri rama kalyanam

శ్రీరామ రామ రామేపి, రమే రామే మనోరమే.. సహ్రసనామ తత్తుల్యం రామనామా వరాననే.. రామాయా, రామభద్రాయ, రామచంద్రాయ నమః.. శ్రీరామ జయం.. ఇలా భక్తుల శ్రీరామ నామస్మరణం చేస్తూ ఉదయాన్నే అలాయాలకు చేరుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత అంజనేయ స్వామివారులను దర్శించుకునేందుకు రావడంతో ఇవాళ ఉదయం నుంచే యావత్ భారతదేశవ్యాప్తంగా అన్ని రామాలయాలు, వైష్ణోవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఇక మరికోద్ది సేపట్లు లోకకల్యాణం సాగే శ్రీసీతారాముల కల్యాణానికి అంతా సిద్ధమయింది. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి దివాలయంలో భక్తులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని గత వారం రోజులుగా ఈ దివ్యక్షేత్రంలో సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సుప్రభాతం పలికి, ఆరాధన నిర్వహించి, మంగళాశాసనం చేశారు. మూలమూర్తుల వైభవాన్ని అభిషేక మహోత్సవం మరింత పెంచింది. వేద పారాయణాలతో అంతా రామమయమై సాక్షాత్కరించింది. మంత్రోచ్ఛరణల మధ్య మేళతాళలతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి ఆరాధన చేశారు. రాత్రి 7 గంటల నుంచి జరిగిన ఎదుర్కోలు ఉత్సవం అంబరాన్ని తాకింది.

ఇక ఇవాళ సాగే కల్యాణ మహోత్సవానికి కన్నులారా వీక్షించాలని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సీతారామ కల్యాణోత్సవం మిధిలా మండపంలో జరుగునుంది. ఈ వేడుకకు సంప్రదాయబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముత్యాల తలంబ్రాలను శ్రీసీతారామచంద్రులకు సమర్పించనుంది. వేసవి నేపథ్యంలో మండే ఎండల వల్ల కలిగే ఉక్క పోత సమస్యను తగ్గించేందుకు 40 టన్నులకు పైగా ఏసీని 40 కూలర్లను 200 ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నారు.

ఇక కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ సాయంత్రం స్వామివారి సన్నిధిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం రంగరంగ వైభవంగా సాగనుంది. అధివారం నాడు శ్రీరామ నవమి ఆస్థానం వైభవంగా జరిగింది. నవమి పర్వదినాన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీరామచంద్రుడికి మందిరంలోని రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజన క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles