actor sivaji explodes sensational news on bjp బీజేపిపై నటుడు శివాజీ సంచలన అరోపణలు..

Actor sivaji explodes sensational news on bjp

Actor Sivaji, operation dravida, operation garuda, BJP, allegations, Andhra pradesh, ruling, TDP, YSRCP, no confidence motion, prime minister, PM Modi, Amit shah, chandrababu, YS jagan, Pawan Kalyan, JanaSena, andhra pradesh, politics

Actor Sivaji Explodes Sensational News on BJP, Says it's doing Operation Dravida in andhra pradesh, utilizing the differences between the parties and trying to come into power.

ITEMVIDEOS: బీజేపిపై నటుడు శివాజీ సంచలన అరోపణలు..

Posted: 03/22/2018 04:19 PM IST
Actor sivaji explodes sensational news on bjp

సినీహీరో శివాజీ బీజేపి పేరు ఎత్తకుండా ఆ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా తామే అధికారంలో వుండేలా ఎక్కడికక్కడ అపరేషన్ చేపడుతున్నారని, ఇందుకు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చపెడుతున్నారని అరోపించారు. ఇక వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తమ అపరేషన్ ద్రవిడ పేరుతో కార్యకలాపాలను ప్రారంభించిందని అన్నారు. ఇందులో భాగమే అపరేషన్ గరుడ అని పేర్కొన్నారు.

ఆపరేషన్‌ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై అధికారాన్ని అందుకునేందుకు ప్రణాళిక రచించిందని అన్నారు. అయితే ఈ ఆపరేషన్‌లో ఆపరేషన్‌ గరుడ భాగమేననని, అయితే గరుడ మాత్రం మన రాష్ట్రానికి ప్రత్యేకమన్నారు. అపరేషన్ పేరు ఏది పెట్టినా.. దాని అంతిమ లక్ష్యం మాత్రం అధికారమేనని అన్నారు. ఇలాంటి అపరేషన్లనే ఎన్నికలు జరిగిన కేరళ, తమిళనాడులో కూడా చేపట్టారని, అయితే అధికారం దక్కలేదని అన్నారు. కాగా ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు సంబంధించి ఆపరేషన్‌ కుమారను అమలు చేస్తుందని అరోపించారు.

కర్ణాటక నుంచి అదే జాతీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వ్యక్తి తనకు ఈ వివరాలను వెల్లడించారని అన్నాడు. ఒక జాతీయ పార్టీ, దానికి లక్ష్యంగా ఉన్న ప్రాంతీయ పార్టీ, వారికి ఉపయోగపడే పార్టీ, పావుగా మరో వ్యక్తి ఇలా.. ఆ ఆపరేషన్‌ క్రమం ఉంటుందని వివరించారు. తన మాటలను ఎవరూ విశ్వసించరని తనకు తెలిసినా.. నిజాలను చెప్పాలనే తాను ఈ విషయాలను చెబుతున్నానన్నారు. గతేడాది సెప్టెంబర్ లోనే తాను ఈ విషయాలను లీక్‌ చేశానన్నారు. ఆపరేషన్‌ కోసం కొంత మొత్తం కూడా ఇప్పటికే బట్వడా జరిగినట్టు తెలిపారు.

ఈ ఆపరేషన్ కు సూత్రధారి ఒక రాజ్యాంగ శక్తి అన్నారు. దీనిలోకి ఎవరికైనా ఎంట్రీ మాత్రమే వుంటుందని ఎగ్జిట్ మాత్రం తెలియదని చెప్పారు. అయితే అంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదని, సమయం వచ్చినప్పుడు ఎలాంటి అపరేషన్ నైనా వికటించేలా చేసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం రేపు అవిశ్వాసంపై చర్చకు సిద్ధపడతారని, అందులో ముగ్గుర్ని ఇంగ్లీషులో, మరో ముగ్గురిని తెలుగులో మాట్లాడిస్తారని వివరించారు. ఆ తర్వాత ఎవరినీ మాట్లాడనీయకుండా సభను వాయిదా వేస్తారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles