'no bill, free food' policy in railways soon రైల్వే గుడ్ న్యూస్.. ’’నో బిల్ ఫ్రీ పుడ్‘‘ రూల్ త్వరలో అమలు

Indian railways to target overcharging with no bill free food policy

Indian Railways, railways, indian railways new policy, IRCTC, railways food quality, Indian railways food quality, food quality, railway passengers, food overcharging complaints

Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has introduced the use of Point of Sale (POS) machines to implement compulsory billing of food on board trains to overcome overcharging.

రైల్వే గుడ్ న్యూస్.. ’’నో బిల్ ఫ్రీ పుడ్‘‘ రూల్ త్వరలో అమలు

Posted: 03/22/2018 09:06 AM IST
Indian railways to target overcharging with no bill free food policy

రైలు ప్రయాణికులకు మరో తీపికబరును అందించింది రై్ల్వే శాఖ. ఇటీవలే ప్రైవేటు క్యాబ్ సంస్థ ఓలాతో కుదుర్చకున్న ఒప్పందం మేరకు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లదారులకు ఇంటివరకు ఉచితంగా దిగబెట్టే సదుపాయం కల్పించే పైలెట్ ప్రాజెక్టుకు అందుబాటులోకి తీసుకువచ్చిన రైల్వేశాఖ.. ఇక మరో గుడ్ న్యూస్ ను కూడా అందించింది. రైలు ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు జారీ చేసిన క్యాటరింగ్ లైసెన్సులను సదరు కాంట్రాక్టర్లు. కేవలం ధనార్జనకే వినియోగించి..  అక్రమాలకు పాల్పడుతూ.. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న అరోపణల అధికంగా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రైల్వే కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. తాజాగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. రైళ్లలో ఏదేని అహారపదార్థాలను విక్రయించిన క్యాటరర్లు తప్పని సరిగా వారు విక్రయించిన వస్తువుకు సంబంధించిన బిల్లును ఇవ్వాలన్న నిబంధనను అమల్లోకి తీసుకురానున్నారు. రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం, టిఫిన్‌, ఇతర తినుబండారాలు, కాఫీ, టీ, శీతల పానీయాలకు సంబంధించి కేటరర్లు విధిగా రసీదు ఇవ్వాలన్న నిబంధనను తెస్తున్నారు.

ఇక తాజా నిబంధనల ప్రకారం బిల్లు ఇవ్వని క్యాటరర్లకు ప్రయాణికులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ‘నో బిల్‌.. ఫ్రీ ఫుడ్‌’ పేరుతో ఈ నెలాఖరులోగా కొత్త పాలసీని అమలు చేయాలంటూ రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే భారతీయ రైల్వే కేటరింగ్‌, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) తన వెబ్‌సైట్‌లో కొత్త పాలసీ వివరాలను అందుబాటులో ఉంచింది. ఈ విషయంపై ప్రయాణికులను చైతన్యపరుస్తోంది. మరోవైపు తమ ఇన్‌స్పెక్టర్లను రైళ్లలో నియమించి, కేటరర్లు ప్రయాణికులకు రసీదులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. అధిక చార్జీలు, రసీదు ఇవ్వడానికి ఫుడ్‌ సర్వర్లు నిరాకరించడంపై ఏడు వేలకు పైగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. రైల్వే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railway  IRCTC  No Bill Free Food  Overcharging on trains  Piyush Goyal  train  

Other Articles