tammareddy questions how pawan is enemy now.? అధికార బిక్షపెట్టిన పవన్ ఎందుకు చెడ్డవాడయ్యాడు: తమ్మారెడ్డి

Tammareddy fires on rajendraprasad questions how pawan is enemy now

tammareddy bharadwaja, mlc rajendra prasad, tollywood celebrities, awardees first, pawan kalyan, APSP, TDP, YSRCP, no confidence motion, TRS, AiADMK, BJP, lok sabha, rajya sabha, Union Govenment, Andhra pradesh, special status, congress, andhra pradesh, politics

Tollywood producer and director thamma reddy bharadwaja fires on tdp mlc rajendra prasad.. and suggests to maintain dignity while taking on tollywood celebrities, question why pawan kalyan become an enemy now.?

పవన్ ఎందుకు చెడ్డవాడయ్యాడు.. రాజేంద్ర్రప్రసాద్ పై తమ్మారెడ్డి ఫైర్

Posted: 03/21/2018 10:37 AM IST
Tammareddy fires on rajendraprasad questions how pawan is enemy now

ప్రత్యేక హోదా కోసం తెలుగు చిత్రపరిశ్రమల నటీనటులు, దర్శక నిర్మాతలు ఎందుకు పోరాడటం లేదని, ఏజ్ భారైన హీరోల మాదిరిగా.. హీరోయిన్ల వెంటపడటానికే పనికివస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్.. ఎవరికైనా అవార్డులు రాకపోతే రచ్చ రచ్చ చేస్తారని ఆయన చేసిన తీవ్రవ్యాఖ్యలపై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదవిలో వున్నాం. అందులోనూ అధికారంలో వున్నామని రాజకీయ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడటం సముచితం కాదని అన్నారు.

ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీకి మిత్రుడిగా వున్న పవన్ కల్యాన్ ఇప్పుడెందుకు చెడ్డవాడయ్యాడని ఆయన ప్రశ్నించారు. పవన్ తొలి నుంచి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలతో పాటు అంధ్రప్రదేశ్ ఎంపీలను నిలదీస్తునే వున్నారని కూడా అన్నారు. అంతేకాదు తిరుపతి, కాకినాడ ఇలా పలు చోట్ల సభలు పెట్టి.. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినప్పుడు.. టీడీపీ ఎందుకు ఆయనకు మద్దుతు ఇవ్వలేదని తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు.

అయితే మంత్రి లోకేష్ పై పవన్ కల్యాన్ చేసిన అరోపణలపై తాను స్పందించించేందుకు నిరాకరించారు. ఒక్క సంవత్సరం టీడీపీకి సమయాన్ని ఇచ్చిన తరువాత పవన్ అప్పటి నుంచి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూనే వున్నారని పేర్కోన్నారు. అయితే ఇటీవల పవన్ కల్యాన్ చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై అరోపణలు చేయడంతో ఆయన వెనుక బీజేపి వుందన్న టీడీపీ విమర్శలను కూడా ఆయన తోసిపుచ్చారు. తన అభిప్రాయం ప్రకారం పవన్ వెనక టీడీపీ లేదని అన్నారు.

సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులను మీ రాజకీయాల కోసం వాడుకోవాలని భావించడం సమంజసం కాదని అన్నారు. చాలామంది సినిమా వాళ్లు టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని, ముందు వాళ్లతో ప్రకటనలు ఇప్పిస్తే, ఆ తర్వాత మిగతావారు మాట్లాడతారని అన్నారు. ఇటీవల నంది అవార్డులను ఎవరికి బడితే వాళ్లకిచ్చేశారు కదా! ఆ అవార్డులు తీసుకున్నవాళ్లతో ప్రత్యేకహోదా విషయమై ముందు మాట్లాడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజేంద్రప్రసాద్ తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు కనుకనే తాను ఈవిధంగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో ఇన్ని రోజులూ మౌనంగా ఉన్న టీడీపీకి ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చిందా? అని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీకి ఇన్నిరోజులు నచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు చెడ్డవాడయ్యాడా? అని ప్రశ్నించారు. పవన్ వెనుక బీజేపీ ఉందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నారా లోకేశ్ పై పవన్ ఆరోపణలు చేయడం మాత్రం సబబు కాదని అన్నారు.

అంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదాపై ఏపీ ఎంపీలందరూ ఢిల్లీలో చేస్తోంది పొలిటికల్ డ్రామా తమ్మారెడ్డి విమర్శించారు. రాజకీయంగా పైచేయి కోసమే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో అన్ని రాజకీయపార్టీలు ఏకతాటిపైకి వస్తే సినీ పరిశ్రమ కూడా కలిసి వస్తుందని అన్నారు. తమిళనాడులో జల్లికట్టుపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు కనుకనే సినీ పరిశ్రమ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles