IRCTC launches 6-month pilot project with Ola రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

Irctc ties up with ola for booking cab on its website app

irctc, irctc ticket booking, irctc online booking, irctc ola tie up, irctc cab service. how to book irctc ola cab, irctc ties up with ola, how to book ola from irctc.com, irctc, ola, irctc partners ola, irctc.com, irctc app, irctc cabs, irctc cab booking, pilot project, railway

IRCTC ties up with Ola! In welcome news for railway passengers, Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has announced a tie-up with cab hailing firm Ola to provide door-to-door transportation service to Indian Railways passengers.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటివరకు క్షేమంగా..

Posted: 03/20/2018 10:05 AM IST
Irctc ties up with ola for booking cab on its website app

ప్రయాణికులకు రైల్వే బ్రహ్మాండమైన శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు రైల్వే టికెట్లు బుక్ చేసుకుని ఆ సమయానికి ముందే స్టేషన్ కు చేరుకునేందుకు ట్రాపిక్ అవాంతరాలను అడ్డంకులను దాటుకుని వెళ్లాల్సి వచ్చిన ప్రయాణికులకు రైల్వే ఊరటను కల్పిస్తుంది. ఈ పోటీలో ఒక్కసారి సమయం దాటిపోయి రైలు ఫ్లాట్ పారమ్ నుంచి వెళ్లిపోవడంతో నిరాశగా తిరుగుముఖం పట్టే ప్రయాణికుల సంఖ్యకూడా అంచనాలకు మించే వుండగా అవే అనుభవాలు పునరావృతం కాకూడదని ముందస్తు జాగ్రత్లు తీసుకుంటున్నారు.

అయితే ఇక్కడ మరో విషయం కూడా వుంది. పర్యటనలు చేసి చేత్తుల్లో బొలడెంత లగ్యేజీతో రైల్వేస్టేషన్ వద్ద దిగే ప్రయాణికుకులకు కేూడా రైల్వే శుభవార్తను అందించింది. ఇన్నాళ్లు రైలు దిగి స్టేషన్ బయటకు వెళ్లగానే టాక్సీలు, అటోవాలాల రేట్లు చూసి బిత్తరపోయే ప్రయాణికులకు ఇకపై ఊరట లభించేలా రేల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులను ఇక నేరుగా వారి ఇంటి దగ్గరే దించనుంది.

అది కూడా ఉచితంగా. ఇందుకోసం ఓలా క్యాబ్ తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఆరు నెలలపాటు ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనున్నారు. ప్రయాణానికి ఏడు రోజుల ముందే ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. అది కూడా మనకు కావాల్సిన కారును బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.  మైక్రో, మినీ, ప్రైమ్ సెడాన్, ప్రైమ్ ప్లే, ఆటో, షేర్.. ఇలా మనకు కావాల్సిన దానిని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.

అయితే క్యాబ్స్ ఇందుకోసం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ‘బుక్ ఎ క్యాబ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్టేషన్‌లో దిగిన వెంటనే క్యాబ్ సిద్ధంగా ఉంటుంది. రైలెక్కిన ప్రయాణికులు క్షేమంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఓలా క్యాబ్ తో ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : irctc  ola  irctc partners ola  irctc.com  irctc app  irctc cabs  irctc cab booking  pilot project  railway  

Other Articles