Aadhaar linking deadline extended by Supreme Court ఆధార్ అనుసంధాన డెడ్ లైన్ పొడగింపు..

Aadhaar linking deadline extended indefinitely till supreme court delivers order

Aadhaar, Supreme Court, Dedaline for linking Aadhaar, Social schemes, UIADI, Biometric, Aadhaar linking with phone, Aadhaar linking with bank accounts, Deadline, Social schemes, UIDAI, Biometric, mobile phone, bank accounts, latest news

The Supreme Court extended on Tuesday the March 31 deadline to link Aadhaar with various services till a constitution bench hearing the matter delivers a judgment.

ఆధార్ అనుసంధాన డెడ్ లైన్ పొడగింపు: సుప్రీంకోర్టు..

Posted: 03/13/2018 04:43 PM IST
Aadhaar linking deadline extended indefinitely till supreme court delivers order

సామాన్యుల హక్కుగా పేర్కోంటూ.. ఆధార్ కార్డును అన్ని సేవలకు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఊరటను కల్పించింది. బ్యాంకు అకౌంట్లు, మోబైల్ ఫోన్, ఇన్సూరెన్స్ పాలసీలు, ఇలా అన్ని సామాజిక సేవలతో పాటు గ్యాస్ సబ్బీడి సహా అన్ని సేవలకు ఆధార్ ను అనుసంధానం చేయడంతో సామాన్యుడు అన్ని కార్యాలయాల చుట్టూ.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బిజీగా మారాడు. అందులోనూ మార్చి 31తో డెడ్ లైన్ ముగుస్తుందన్న నేపథ్యంలో ఆధార్ జిరాక్సులు తీసుకెళ్లి అన్నింటికీ అనుసంధానం చేయడంలో నిమగ్నమయ్యాడు.

కాగా ఇవాళ ఆధార్ దేశ పౌరుల వ్యక్తిగత భద్రతా హక్కు అని గత కొంతకాలం క్రితం తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ధర్మసనం తీర్పును వెలువరించింది. కాగా ఆధార్ నెంబర్ ను అన్ని సేవలతో అనుసంధానం తప్పనిసరి చేస్తున్న నేపథ్యంలో దాఖలైన పిటీషన్లపై విచారణ కొనసాగిస్తున్న ఐదుగురు సభ్యుల గల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం.. మార్చి 31 అంటూ సాగుతున్న ప్రచారంపై స్పష్టతను వెలువరించింది. తమ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చేంత వరకు ఎలాంటి డెడ్ లైన్ వుండబోదని తేల్చిచెప్పింది.

ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వెల్లడించారు. తాము తీర్పును వెలువరించే వరకు ఎలాంటి డెడ్ లైన్లు వుండవని అన్నారు. అధార్ తప్పని సరి అంటూ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా పౌరులను అందోళనకు గురి చేయడం సముచితం కాదని పేర్కోన్నారు. దీంతో ఆధార్ అనుసంధానానికి తమ తీర్పు వెలువరించిన తేదీనే తుది గడువును వెల్లడించడమా..? లేక మరేంటా అన్న నిర్ణయం తీసుకుంటామని సీజేఐ చెప్పారు. అప్పటి వరకు దేశపౌరులు ఎలాంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar  Supreme Court  Deadline  Social schemes  UIDAI  Biometric  mobile phone  bank accounts  

Other Articles