Abnormal landing to blame for US Bangla airplane crash పైలట్ నిర్లక్ష్యంతోనే కుప్పకూలిన బంగ్లా విమానం..

Nepal crash seemingly followed confusion over plane s path

US Bangla airplane, tribhuvan international airport, katmandu airport, pilot's negligence, abnormal landing, dgca, traffic control, preliminary investigation, emergency, sanjib gautam, Nepal areoplance crash, Nepal's capital, Kathmandu, 67 passengers on board, 17 passengers rescued, US-Bangla, a Bangladeshi airline, social media

Director General of the Civil Aviation Authority of Nepal (CAAN), Sanjib Gautam has said a preliminary investigation showed that the US Bangla passenger airplane accident happened because of the abnormal landing by the aircraft.

49 మంది సజీవదహనానికిని పైలట్ నిర్లక్ష్యమే కారణం..

Posted: 03/13/2018 11:34 AM IST
Nepal crash seemingly followed confusion over plane s path

నేపాల్ రాజధాని ఖాట్మాండులో శివారల్లో క్రితం రోజు మధ్యాహ్నం విమానం కుప్పకూలపోవడానికి, 49 మంది ప్రయాణికులు సజీవ దహనం కావడానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని తేలింది. ప్రాథమిక ధర్యాప్తును పూర్తి చేసిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సివిల్ ఏమియేషన్ అథారిటీ అఫ్ నేపాల్ డైరెక్టర్ జనరల్ సంజీబ్ గౌతమ్ వివరాలను వెల్లడిస్తూ.. గడచిన 25 సంవత్సరాల్లో నేపాల్ లో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనని.. దీనికి కారణం కూడా పైలట్ నిర్లక్ష్యమేనని తెలిపారు.

విమానాశ్రయంలో సక్రమంగా ల్యాండింగ్ చేయకపోవడం వల్లే విమానం అదుపు తప్పి పక్కనున్న పంటపోలాల్లోకి వెళ్లిందని, దీంతో వెనువెంటనే మంటలు అంటుకుని ఘోర ప్రమాదం సంభవించిందని అన్నారు. విమానాశ్రాయం ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు విమానాన్ని దక్షిణపు వైపు నుంచి ల్యాండ్ అయ్యేందుకు పైలట్ కు అనుతి ఇచ్చారని, అయితే దానిని లక్ష్యపెట్టకుండా పైలట్ ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ కు ప్రయత్నించడంతోనే ల్యాండింగ్ క్రమంలో ప్రమాదం సంభవించిందిని గౌతమ్ తెలిపారు. అయితే కనీసం విమానాన్ని ఉత్తరం వైపు నుంచి ల్యాండింగ్ చేస్తున్న క్రమంలో పైలట్ కనీసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సంకేతాలను కూడా అందించలేదని గౌతమ్ స్పష్టం చేశారు.

డని  కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 22 మందిని విమాన సహాయ సిబ్బంది రక్షించి ఖట్మాండులోని వివిధ అస్పత్రులలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు విమానంలో వుండగా, వారిలో 37 మంది పురుషులు, 28 మంది మహిళలు, ఇద్దరు చిన్నారు వున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కాగా వీరిలో 33 మంది నేపాలీ జాతీయులు కాగా, 32 మంది బంగ్లాదేశీయులని, ఒకరు చైనా, మరోకరు మాల్దీవ్ జాతీయులని అధికారులు తెలిపారు. కాగా క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం అదేశాలను జారీ చేసిందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles