Telangana a role model for the country, says Governor బంగారు తెలంగాణ దిశగా వేగంగా అడుగులు: గవర్నర్

Telangana s initiatives have led the state to become a role model for the country governor

ESL Narasimhan, Governor Narasimhan, Telangana, Telangana Legislative Assembly, Telangana Legislative Council, budget session, Narasimhan budget speech, swamy goud, congress, komatireddy venkat reddy, Telangana News, Telangana politics

Governor ESL Narasimhan in his address at the joint sitting of the Telangana Legislative Assembly and Council in Hyderabad said that the state government continues to follow the fundamental principle of faster economic growth.

కాంగ్రెస్ నిరసనల మధ్య సాగిన గవర్నర్ ప్రసంగం..

Posted: 03/12/2018 11:54 AM IST
Telangana s initiatives have led the state to become a role model for the country governor

రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా శరవేగంగా అడుగులు వేస్తోందని గవర్నర్ ఈఎస్ఎన్ నరసింహన్ అశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్ సమావేశాల తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తూ.. గడిచిన మూడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. ఎన్ని అడ్డుంకులు ఎదురైనా అభివృద్ది పట్ల కృతనిశ్చయంతో ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయినిగా మారనుందని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో అటు వ్యవసాయానికి, ఇటు గృహావసరాలకు, మరోవైపు పారిశ్రామిక రంగానికి 24 గంటలూ కోతల్లేని విద్యుత్ ను అందిస్తూ ముందుకు సాగడం దేశంలోనే అదర్శవంతంగా అవతరించిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయని నరసింహన్ వెల్లడించారు. అన్ని వర్గాల ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టిన తన ప్రభుత్వం, గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతం చేసిందని అన్నారు.

కాగా గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో అనర్గళంగా అబద్దాలను వెల్లవేయడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ సభ్యులు.. అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డి తదితర సభ్యులు చేస్తున్న నినాదాల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయినా గవర్నర్ తన ప్రసంగం వేగాన్ని పెంచడంతో..  పోడియం వైపు దూసుకువచ్చిన కాంగ్రెస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో సభలో మరింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles