First conviction in Bengal, man gets 5 years in jail ‘నెట్’లో యువతి నగ్నచిత్రాలు.. న్యాయస్థానం సంచలన తీర్పు..

First conviction in bengal man gets 5 years in jail

Animesh Bakshi, revenge porn, kolkatta Court, objectionable photos, UPLOADING PHOTOS, B.tech student, Jail, Kolkata revenge porn, Kolkata news, revenge porn conviction, East Midnapore, West Bengal, crime

Justice came to a 20-year-old victim of revenge porn on the eve of International Women’s Day with a court in Bengal’s East Midnapore district sentencing a man to five years in jail.

‘నెట్’లో యువతి నగ్నచిత్రాలు.. న్యాయస్థానం సంచలన తీర్పు..

Posted: 03/08/2018 01:20 PM IST
First conviction in bengal man gets 5 years in jail

మానవుడి జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనది. ఈ దశలో యువత సన్మార్గంలో పయనిస్తే.. వారు జీవితాంతం అదే బాటలో పయనిస్తారని, అదే వక్రమార్గం పడితే దేశానికి చీడపురుగులుగా మారే ప్రమాదముందని పెద్దలు అనేక సందర్భాలలో చెప్పారు. పెద్దల మాటలను పెడచెవిన పెట్టిన ఓ విద్యార్థి.. చదువుకునే క్రమంలోనే ఓ అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. అమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అమెతో మూడేళ్ల పాటు స్నేహం చేసి.. అమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఆ యువతి అతనికి లొంగకపోవడం.. అతని శారీరిక వాంఛను తీర్చేందుకు నిరాకకరించడంతో అమైపై ద్వేషాన్ని పెంచుకున్న విద్యార్ధి అ యువతికి సంబంధించిన నగ్న చిత్రాలను అంతర్జాలంలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. విచారించిన న్యాయస్థానం విద్యార్థికి దిమ్మదిరిగే తీర్పును వెలువరించింది. ఏకంగా ఐదేళ్ల పాటు జైలు శిక్షను విధించింది.

కాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాంలోనే ఈ తరహా కేసు తీర్పు నేపథ్యంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, న్యాయస్థానం తీర్పు  మహిళా అంతర్జాతీయ దినోత్సవం రోజునే వెలువరించడం పట్లు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పన్సుకుర పట్టణానికి చెందిన బీటెక్ విద్యార్థి యానిమేష్ బాక్సీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మూడేళ్ల పాటు ఆమెతో స్నేహం చేశాడు. అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయి ఫోటోలు, వీడియోలు తీసుకొని... బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. అందుకు యువతి నిరాకరించింది.

దీంతో యువతిపై ద్వేషంతో రగిలిపోయిన బాక్సీ..  ఆమె అర్థనగ్న ఫోటోలను అంతర్జాలంలో అప్ లోడ్ చేశాడు. దీంతో బాధితురాలు యువకుడిపై గత ఏడాది జులై 21 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమ్మాయి అర్థనగ్న ఫోటోలను ఇంటర్ నెట్ లో పెట్టడంతో ఆయా ఫోటోలను క్లిక్ చేసిన ప్రతీసారి తనపై వర్చువల్ గా అత్యాచారం చేసినట్లయిందని అమ్మాయి కోర్టులో చెప్పింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐడీ పోలీసులు 60 రోజుల్లోనే దర్యాప్తు చేసి 18 మంది సాక్షులతో చార్జీషీటు వేశారు. దీంతో నేరగాడైన బీటెక్ విద్యార్థి యానిమేష్ బాక్సీకి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 9వేల రూపాయల జరిమానా విధిస్తూ తూర్పు మిడ్నాపూర్ టమ్లాక్ జుడీషియల్ మెజిస్ట్రేట్ గౌతం కుమార్ నాగ్ సంచలన తీర్పు వెలువరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles