Legendary Actress Sridevi Cremation Completed | అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు.. కదిలిన తారా లోకం.. అభిమానులు

Sridevi last rites completed

Actress Sridevi, Actress Sridevi Cremations, Sridevi Last Rites, Sridevi Funeral, RIP Sridevi

Actress Sridevi Cremation to be held with full State Honours. Friends, family and fans gather at the funeral to pay their last respects to the late actress.

ITEMVIDEOS: అశ్రునయనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు

Posted: 02/28/2018 05:53 PM IST
Sridevi last rites completed

లెజెండరీ తార కోట్లాది మంది అభిమాన నటి శ్రీదేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి ఆమె అంతిమ యాత్ర ఏడు కిలోమీటర్ల మేర జరిగి, విల్లే పార్లేలోని సమాజసేవ శ్మశానవాటికకు చేరుకుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమ, లక్షలాది అభిమానులు ఆమెను తీసుకెళ్లిన వాహనంతోపాటు కదిలారు. కడసారి ఆమెను చూసేందుకు కదిలారు.

అటుపై మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు కొనసాగాయి. అంతకు ముందు అధికారులు ఆమె భౌతికకాయంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు.

ఫోటోల కోసం క్లిక్ చెయ్యండి

దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో పడి మునిగి ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇకలేదన్న విషాదాన్ని భారతీయ సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అంతిమయాత్ర కోసం...
ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమయాత్ర కొనసాగుతోంది. శ్రీదేవి పార్థివదేహానికి ఎర్రని, బొట్టు పూలతో అలంకరించారు. శ్రీదేవికి కాంజీవరం చీరలంటే ఎంతో ఇష్టమట. అందుకే, ఆమె భౌతికకాయానికి బంగారు, ఎరుపు రంగుల మిశ్రమంతో కూడిన కాంజీవరం చీరను కప్పారు. శ్రీదేవికి తెలుపు అంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే, అందుకే, ఆమె అంతిమ యాత్రకు సంబంధించి అంతా తెలుపు రంగులో ఉండేలా చూశారు. అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనం మొత్తం పలు రకాల తెల్లపూలతో అలంకరించారు. అందులో పెట్టిన శ్రీదేవి చిత్రపటం చుట్టూ కూడా తెల్లపూల దండలను ఉంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles