Kanchi seer Jayendra Saraswathi passes away | కంచి కామకోఠి పీఠాధిపతి కన్నుమూత

Jayendra saraswathi passes away

Kanchi Seer, Jayendra Saraswathi Death, Sri Jayendra Saraswathi Swamy, Kancheepuram Sankara Mutt, Kanchi Seer Died, Jayendra Saraswathi, Kamakshi Amman Temple

Sri Jayendra Saraswathi Swamy, the senior seer of Kancheepuram Sankara Mutt, passed away on Wednesday. The 82-year old seer was admitted to a hospital near Kamakshi Amman temple on Wednesday due to breathing problems. The hospital and Mutt sources confirmed his demise.

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి కన్నుమూత

Posted: 02/28/2018 10:30 AM IST
Jayendra saraswathi passes away

కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఇక లేరు. ఈ ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. 82 ఏల్ల జయేంద్ర సరస్వతి గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

జయేంద్ర సరస్వతి శివైక్యంపై పీఠం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ పీఠాధిపతి. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంగా ఉన్నారని.. పరిస్థితి విషమించటంతో ఈ ఉదయం స్థానికంగా ఉన్న ఏబీసీ ఆసుపత్రికి హుటాహుటిన తరలించామని.. వైద్యులు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని వారు వివరించారు.

ఆయన గురించి...
జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యార్. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావూరు జిల్లా ఇరునీకల్ గ్రామంలో ఆయన జన్మించారు. 1954 మార్చి 22న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్ తర్వాత ఆయన బాధ్యతలను చేపట్టారు. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా ఆయన బాధ్యతలను స్వీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles