Line Clear for Sridevi Dead body Move to India | శ్రీదేవి మృతదేహానికి లైన్ క్లియర్.. దర్యాప్తు మాత్రం కొనసాగుతుందంట!

Sridevi dead body moves to india

Sridevi, Sridevi Death, Sridevi Death Mystery, Sridevi Dead Body,

The Dubai Police have cleared the release of Bollywood icon Sridevi’s body for the embalming process, ending her family’s two-day wait for the next step in bringing the body home for cremation. Apart from Sridevi’s husband Boney Kapoor, her stepson Arjun Kapoor is also in Dubai to oversee the formalities. Sridevi’s death was announced early on Sunday but the funeral, which will take place in Mumbai, has been delayed for two days pending paper work in Dubai where the actor had gone to attend a family wedding. Sridevi’s husband Boney Kapoor had given a statement to the Dubai Police on the circumstances surrounding his wife's death. Kapoor reportedly discovered Sridevi unconscious in the bathtub filled with water in the hotel. She was taken to a hospital where she was declared brought dead.

శ్రీదేవి మృతదేహ తరలింపునకు లైన్ క్లియర్

Posted: 02/27/2018 03:40 PM IST
Sridevi dead body moves to india

దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలో బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందిన శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కాసేపట్లో అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. దీంతో ఆమెను అక్కడి నుంచి కాసేపట్లో ముంబయికి తరలించనున్నారు.

ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయానికి రసాయన ప్రక్రియ(ఎంబామింగ్‌) పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత ఆమెను ప్రత్యేక విమానంలో ముంబయి తీసుకురావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. కాగా, కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. శ్రీదేవి ప్రమాదవశాత్తు నీళ్లలో పడి మునిగి మృతి చెందారని అక్కడి ఆరోగ్య శాఖ పేర్కొన్న విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, మంగళవారం పూర్తి ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేవరకు వేచిచూసి.. ఆతర్వాతే శ్రీదేవి భౌతికకాయాన్ని విడుదల చేసినట్టు తెలుస్తోంది.

ప్రక్రియ ఆలస్యంగా అవుతుండటంతో తండ్రితో ఉండటానికి బాలీవుడ్‌ నటుడు అర్జున్‌కపూర్‌ దుబాయ్‌ బయలుదేరాడు. దుబాయ్‌ పోలీసులు అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీదేవి పార్థీవదేహం ముంబైకి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫోరెన్సిక్ నివేదికలో అనుమానాలు నివృత్తి కావటంతో కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించిన ప్రాసిక్యూషన్ అధికారి, బోనీకపూర్ ముంబైకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles