Former CM Slams Rahul Gandhi as Bachcha | రాహుల్ గాంధీ ఓ బచ్చా అంటూ మాజీ సీఎం ఫైర్

Yeddyurappa criticize rahul gandhi

BS Yeddyurappa, Congress President, Rahul Gandhi, Karnataka Elections 2018, Yeddyurappa Slams Rahul Gandhi

Former BJP chief minister of Karnataka BS Yeddyurappa slams Rahul Gandhi. Called Rahul a "bachcha", or 'a kid' and Confident on 150 Seats Win in Karnataka.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు

Posted: 02/21/2018 05:08 PM IST
Yeddyurappa criticize rahul gandhi

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ‘పిల్లోడు, కుర్రకుంక’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం బీజేపీ సోషల్ మీడియా కాంక్లేవ్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో రాహుల్ ప్రచారం చేపట్టడంపైనే ఆయన విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరిన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని, 150కి పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తమ పార్టీ మాత్రం నిజాయతీగా పేదలకు చేయూతనిస్తోందన్న ఆయన కాంగ్రెస్ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. పనిలో పనిగా ఆయన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కూడా విరుచుకుపడ్డారు. కాగా, ఏప్రిల్ - మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles