Flyer at Delhi airport claims pilot threatened to crash plane ‘‘సోషల్ మీడియాలో పోస్టు చేస్తే విమానాన్ని పేల్చేస్తాం’’

Indian pilot allegedly threatened to crash plane after passengers filmed him reporting late

Delhi-Bengaluru goair flighr, Pilot threatens to crash flight, GoAir pilot threatens to crash flight, GoAir, Indira Gandhi International Airport, Delayed GoAir flight, GoAir passengers claim pilot threatened to crash plane, Plane crashes in india, pilot Plane Crash

There was chaos at New Delhi's Indira Gandhi International Airport after passengers of a GoAir flight alleged that the captain of the aircraft had threatened to crash a Bengaluru-bound flight, a report said.

‘‘సోషల్ మీడియాలో పోస్టు చేస్తే విమానాన్ని పేల్చేస్తాం’’

Posted: 02/19/2018 04:24 PM IST
Indian pilot allegedly threatened to crash plane after passengers filmed him reporting late

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైలట్లు బరితెగించి, ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడ్డారు. వారిని ఏకంగా బ్లాక్ మెయిల్ చేశారు. ఎంతలా అంటే తమకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే విమానాలను పేల్చేస్తామని హెచ్చరించారు. ఇంతగా ప్రయాణికులను బెదిరించాల్సిన అవసరం ఫైలెట్లకు ఎందుకు వచ్చింది.? అంటే వారు నిర్ణీత సమయానికి కాకుండా ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా విమానాశ్రయంలోని విమానం వద్దకు చేరుకోవడమే. అయితే ఏంటని అంటారా..? అలస్యంగా వచ్చిన తమ రాకను ప్రయాణికులు వీడియోలు తీయడం గమనించిన పైలెట్లు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. విమానం పేల్చేస్తామని బెదిరించినట్టు కొందరు ప్రయాణికులు ఆరోపించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గోఎయిర్ సంస్థకు చెందిన జీ8 113 విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ సమయం ప్రకారం ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులంతా గంట ముందుగానే చెక్ ఇన్ అయ్యారు. ఇక ప్రయాణికులందరూ ఉదయం 5.10 నిమిషాలకు విమానం వద్దకు చేరకున్నారు. అయినా అక్కడ వారికి పైలెట్ల జాడ కనిపించలేదు. దీంతో చిరెత్తుకోచ్చిన ప్రయాణికులు అప్పటికే అక్కడి సిబ్బందిపై అలస్యానికి గల కారణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమయం ఏడు గంటలు కావస్తున్నా..  విమానం కదులుతుందో లేదో కూడా తెలియని ప్రయాణికులు ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో కేకలు వేయడం మొదలుపెట్టారు.
 
ఇక నింపాదిగా రెండు గంటల ఆలస్యంగా సుమారు 7:30 సమయంలో పైలట్లు విమానం వద్దకు చేరుకోవడాన్ని ప్రయాణికులు గమనించారు. దీంతో అప్పటికే అగ్రహంతో రగలిపోతున్న ప్రయాణికులు వారి రాకను తమ సెల్ ఫోన్లలో బంధించారు. దీనిని గమనించిన పైలెట్లు వాటిని తీయకూడదని వారించారు. అయితే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ప్రయాణికులు కూడా ఖరాఖండీగా చెప్పారు. దీంతో పైలెట్లు ఏదో సణుగుకుంటూ విమానంలోకి ఎక్కడం విన్న ఓ ప్రయాణికుడు.. తన సహచర ప్రయాణికులతో ఏదో విషయం చెప్పాడు. అంతే ఇక ఆ పైలెట్లు తమకు వద్దని ప్రయాణికులు పట్టుబట్టారు. అయితే పైలెట్లను మార్చడానినిక యాజమాన్యం ససెమిరా అనడంతో.. ముగ్గురు ప్రయాణికులు విమానం దిగి వెళ్లిపోయారు.

అసలు ఆ ప్రయాణికుడు ఏం చెప్పాడంటే.. తమ అలస్యాన్ని తమ సెల్ ఫోన్లలో వీడియోలుగా బంధించిన దృష్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే తాను మార్గమథ్యంలో విమానాన్ని పేల్చేస్తానని అన్నాడని అరోపించడంతో విమానంలో కలకలం రేగింది. దీంతో ఆ పైలెట్లు తమకు వద్దనీ.. వెంటనే వారిని మార్చేయాలంటూ ప్రయాణికులు పట్టుబట్టారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో పైలెట్లు మాత్రం.. యాజమాన్య సమస్యల వల్లే తాము ఆలస్యంగా రావాల్సి వచ్చిందని.. తమను అపార్థం చేసుకోవద్దని వివరించారు. ఇక ఈ గందరగోళం మధ్య ఎట్టకేలకు ఉదయం 8:40 బయల్దేరిన విమానం చివరకు బెంగళూరుకు 11.20 కు చేరకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GoAir  threatens  Plane  Pilot  Flyer  Crash  IGI  Airbus  Delhi-Bengaluru  

Other Articles