TDP shocks minister adinarayana reddy, takes U turn మంత్రి అదినారాయణ యూటర్న్: అవి నా వ్యక్తిగత వ్యాఖ్యలు

Tdp shocks minister adinarayana reddy takes u turn

Minister adinarayana, adinarayana, U Turn, special status to AP, Andhra pradesh, special status, chandrababu naidu, rajendra prasad, MP's resignation, YSRCP

Minister adinarayana reddy takes U turn on his statement in regard with mps resignation on demanding special status to andhra pradesh, says its his own decision.

మంత్రి అదినారాయణ యూటర్న్: అవి నా వ్యక్తిగత వ్యాఖ్యలు

Posted: 02/15/2018 08:11 PM IST
Tdp shocks minister adinarayana reddy takes u turn

కేంద్ర ప్రభుత్వంతో ఖయ్యం పెట్టుకుని సాధించేది ఏమీలేదని, అందుచేత మంచిగా వుండి రాష్ట్రాభివృద్దికి నిధులు తెచ్చుకోవాలన్నదే తమ ముఖ్యఉద్దేశమని గత మూడున్నరేళ్లుగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్నికల సమయంలో కేంద్రానికి ఎదురుతిరగడం అంతా నాటకమని వైసీపీ నేతలు విమర్శలను తోసిపుచ్చేందుకు రంగంలోకి దిగిన మంత్రి అధినారాయణ రెడ్డి.. ఏపీ ప్రత్యేక హోదా, సమస్యలు పరిష్కర్కరం కోసం కేంద్రప్రభుత్వం నుంచి వైదొలగాన్న వైసీపీ డిమాండ్ ను స్వీకరిస్తున్నామని అదినారాయణ రెడ్డి సవాల్ స్వీకరించారు.

కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే వైసీపీ ఎంపీల కంటే నెల రోజుల ముందుగానే తమ ఎంపీలు కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతారని కూడా స్పష్టం చేశారు. కేంద్రానికి మార్చి 5 డెడ్ లైన్ విధిస్తున్నామని, ఈలోగా సమస్యలు పరిష్కరించకుంటే తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆయనతో విభేదించారు. అవి ఆదినారాయణరెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలని అన్నారు. ఇంతలోనే అదినారాయణ రెడ్డి మరోమారు మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యల నుంచి యూ-టార్న్ తీసుకున్నారు.

‘ఈ వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగతం. పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. జగన్ ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. మా పరిస్థితిని బట్టి నా వ్యక్తిగతంగా లెక్కలేసుకుని చెప్పిన మాట. ఈ విధంగా చెబితే మాకు పట్టుదల ఉంటుంది!  కేంద్ర బడ్జెట్ లో ఏపీకి న్యాయం జరగలేదు. ఈ బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ మార్చి 5న జరుగుతుంది కనుక, ఆ రోజున మా పార్టీ ఎంపీలు బయటకొస్తే బాగుంటుందని, కేంద్రం కూడా పరిశీలిస్తుందనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశాను. నా వ్యక్తిగత అభిప్రాయం కిందే ఈ వ్యాఖ్యలు చేశాను. సీఎం గారు మాతో అన్న మాటలు కావు ఇవి. ఫలానా వ్యాఖ్యలు చెయ్యమని, చెయ్యొద్దని.. ఉపసంహరించుకోమని పార్టీ ఎప్పుడూ డైరెక్షన్ ఇవ్వదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నేను వ్యక్తం చేసిన నా సొంత అభిప్రాయం ఇది’ అని చెప్పుకొచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : adinarayana  U Turn  special status to AP  Andhra pradesh  special status  chandrababu naidu  YSRCP  

Other Articles