Easy closure for small savings schemes likely స్మాల్ సేవింగ్స్ లో ఇక వెనక్కు తీసుకునే ఛాన్స్..

Government may allow early withdrawal of small savings schemes

PPF, premature account closure, government savings bank act, savings, senior citizens savings scheme, SCSS, interest rates, PPF, SSY

Subscribers of small savings schemes, including the public provident fund (PPF), may be able to close their accounts prematurely with the government looking to provide flexibility to investors to deal with financial exigencies.

స్మాల్ సేవింగ్స్: డబ్బు అవసరమైతే ఉపసంహరణకు ఛాన్స్..

Posted: 02/12/2018 02:43 PM IST
Government may allow early withdrawal of small savings schemes

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేయాలని సంకల్పించిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పోస్టాఫీసు పథకాలుగా అందరికీ దగ్గరైన ఈ చిన్నమొత్తాల పోదుపు పథకాల్లో డబ్బు అవసరమైన నేపథ్యంలో మధ్యలో విత్ డ్రా చేసుకునే వెసలుబాటు లేకపోవడంతో ఈ పథకాల్లో డబ్బులు వేసే ఖాతాదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో పాటు నోట్ల రద్దు తదితర అర్థిక సంస్కరణల నేపథ్యంలో చిన్నమొత్తాలకు ఇచ్చే పెద్ద వడ్డీ రేటు కూడా క్రమంగా తగ్గిపోయింది. దీంతో చిన్నమొత్తాల పోదుపు పథకాలపై ప్రజలు అసక్తిని కనబర్చకపోవడంతో క్రమంగా ఇవి వైపు చూడటం మానివేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన కేంద్రం ఈ పథకాలలో సవరణలు చేయాలని ప్రతిపాదించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) సహా అన్ని రకాల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ నుంచి ఖాతాదారులు తమకు డబ్బు అవసరమైనప్పుడు అకౌంట్ ను క్లోజ్ చేసి.. డబ్బును ఉపసంహరించుకునే వెసలుబాటు కల్పించనుంది. ఫిబ్రవరి 1 బడ్జెట్ లో ఈ మేరకు కేంద్రం మార్పుల్ని ప్రవేశపెట్టింది. గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్ ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన వల్ల ఈ పథకాలకు ఆదరణ పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న పీపీఎఫ్ యాక్ట్ 1968, గవర్నమెంట్ సేవింగ్స్ సర్టిఫికెట్ యాక్ట్ 1959, గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంకు యాక్ట్ 1873లను రద్దు చేయనుంది.

అలాగే, చిన్న మొత్తాల పొదుపు పథకాల నుంచి వైదొలిగే నిబంధనలను ఎప్పటికప్పుడు సవరించే అధికారం కేంద్రానికి ఉంటుంది. వైద్యం, ఇతర అత్యవసరాల్లో డబ్బుల్ని ఈ పథకాల నుంచి వెనక్కి తీసుకునే అవకాశం రానుంది. అలాగే, మైనర్లు కూడా తమ వారసులను నామినేట్ చేసుకోనే వెసలుబాటు కూడా కల్పించనున్నారు. అన్ని పథకాల్లోనూ మైనర్ల తరఫున వారి సంరక్షకులు డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. చిన్న మొత్తాల పొదుపు పథకాలు అన్నింటిలోనూ ఒకే విధమైన నిబంధనలు ఉండేందుకు కేంద్ర సర్కారు ఈ మేరకు మార్పులకు పూనుకుంది. ఇక ఈ వార్షక ఏడాది నుంచి మూడుమాసాలకో పర్యాయం కేంద్రం చిన్నమొత్తాల పోదుపు పథకాలపై వడ్డీని నిర్ణయించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles