Man Sneaks Into Airport in Bid to Meet Fiancee ప్రయసి కోసమై.. షార్టా ఎయిర్ పోర్టులో యువకుడి సాహసం..

Indian engineer runs on to sharjah airport runway to catch plane to meet fiancee

Indian, Sharjah Airport, runway, flight, plane, fiancee, Love, RK, Valentine's Day, Judge Mahamood Abu Baker, sharjah labor laws, Inernational law

A 26-year-old Indian civil engineer was brought before Sharjah Sharia Court after he tried to breach the airport wall to catch a plane without his passport,

ప్రేయసి కోసమై.. షార్జా ఎయిర్ పోర్టులో యువకుడి సాహసం..

Posted: 02/09/2018 11:42 AM IST
Indian engineer runs on to sharjah airport runway to catch plane to meet fiancee

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్న పాట రచించి కొన్ని దశాబ్దాలు కావస్తున్నా.. ఇప్పటికే అనేకమంది ప్రేమికులకు.. ప్రేమలో పడి సాహసాలు చేసేవారిని చూసినా, విన్నా ఇదే పాటను అలపించాల్సి వస్తుంది. తాజాగా తన ప్రేయసితో పీకల్లోతు ప్రేమలో చిక్కుకున్న ఇంజనీరింగ్ యువకుడు తన కాళ్లపై తాను నిలబడాలని షార్జా బాట పట్టాడు. ఉద్యోగంలో చేరాడు. స్థిరపడ్డాడు. ఇక తన ప్రేయసితో రోజు చాటింగ్ చేస్తున్నా.. అమెతన చెంతకు తీసుకున్న తృఫ్తి మాత్రం రావడంలేదు. దీంతో ఇండియాకు రావాలని ప్లాన్ చేసినా.. కంపెనీ బాస్ సెలవునివ్వలేదు. ఒకటి కాదు రెండు ఏకంగా పదిహేను సార్లు తాను లీవ్ అడిగినప్పుడల్లా తిరస్కరించాడు. దీంతో రిస్క చేసి తన ప్రేయసిని కలవాలని యువకుడు పెద్ద సాహసమే చేశాడు.

ఇండియాకు చెందిన ఆర్కే (26) షార్జాలోని ఓ కంపెనీలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తన ప్రేయసి కలిసేందుకు ఆయన ప్లాన్ ను తూచా తప్పకుండా అమలు చేశాడు. ఏకంగా షార్జా ఎయిర్ పోర్ట్ దగ్గరకు వచ్చాడు. ఎత్తైన గోడ ఎక్కాడు. భారత్ కు వెళ్లేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం ఎక్కేసేందుకు పరుగు ప్రారంభించాడు. దీనిని గమనించిన షార్జా పోలీసులు వేగంగా వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

దీంతో ఎందుకిలా చేశావని న్యాయమూర్తి ఎప్పుడు అడుగుతారా..? అని ఎదురుచూసిన అర్కే.. తన మదిలో వున్న బాధనంతా వెళ్లగక్కాడు. కేవలం తన ప్రేయసిని కలవడం కోసమే నేను విమానం ఎక్కడానికి ప్రయత్నించానని, అమెను చూడకుండా తాను ఉండలేనని వివరించాడు. ఇండియాలో ఉన్న తనను షార్జాలో వున్న తాను విమానాశ్రయం గుండా రాచమార్గంలో వెళ్లేందుకు తన పాస్ పోర్టు తాను పనిచేస్తున్న కంపెనీ వద్ద వుందని.. యాజమాన్యం ఇప్పటికి 15 సార్లు ఇండియా వెళ్లడానికి అనుమతి కోరినా తిరస్కరించిందని చెప్పాడు. తన తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు తన మనస్సులోని భాదను వివరించాడు అర్కే.

పాస్ పోర్టు లేకుండా విమానాశ్రయం అధికారులు తనను భారత్ వెళ్లేందుకు అనుమతించరని అలోచించే తాను ఎయిర్‌ పోర్ట్ గోడను దూకి, రన్‌ వేపైకి డైరెక్ట్‌ గా వెళ్లి విమానం ఎక్కి ఇండియా వెళ్దామనుకున్నానని అర్కే న్యాయమూర్తికి వివరించాడు. ఒకవేళ తాను పట్టుబడితే.. అన్నఅలోచన కూడా వచ్చిందని, ఇలా పొలీసులకు చిక్కనప్పుడు వారు  కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తికి తన వ్యధను వివరించాలని కూడా నిర్ణయించుకున్నానని చెప్పాడు. అర్కే విరహవేదనను అర్థం చేసుకున్న న్యాయమూర్తి.. ఇలా చేయడం తప్పు.. అని మందలించి అతనికి బెయిల్ మంజూరు చేశారు. అంతేకాదు కంపెనీ నుంచి పాస్ పోర్టు కూడా ఇప్పించాడు. దీంతో అర్కే తన ప్రేయసిని కలిసేందుకు ఇండియాకు రానున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian  Sharjah Airport  runway  flight  plane  fiancee  Love  RK  Valentine's Day  sharjah  

Other Articles