Sonia comes to TDP support in Parliament లోక్ సభలో ఏపీ ప్రత్యేకహోదాపై కదిలిన కాంగ్రెస్.!

Sonia gandhi talks and extends support to tdp mps about ap

Sonia Gandhi, TDP MPs, Kesineni Nani, Ram Mohan Naidu, Thota Narasimham, issues of AP, parliament

Sonia Gandhi has interacted with the senior MPs of TDP. Sonia personally interacted with Kesineni Nani, Ram Mohan Naidu, Thota Narasimham to know the issues of AP and the things happening in AP.

లోక్ సభలో ఏపీ ప్రత్యేకహోదాపై కదిలిన కాంగ్రెస్.!

Posted: 02/08/2018 03:30 PM IST
Sonia gandhi talks and extends support to tdp mps about ap

కేంద్రబడ్జెట్ లో అంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేశారంటూ ఇటు వామపక్షాలు ఇచ్చిన బంద్ కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. ఏపీకి ప్రత్యేక హోదాఇవ్వాలని ఇప్పటికే పార్లమెంటులో పలుమార్లు డిమాండ్ చేసింది. అయితే సరిగ్గా ఎన్నికల ఏడాదిగా సంకేతాలు వస్తున్న క్రమంలో టీడీపీ ఎంపీలు బడ్జెట్ లో కేటాయింపుల విషయమై నిరసనను వ్యక్తం చేస్తూ పార్లమెంటులోని ఉభయ సభలను స్థంభింపజేస్తున్న క్రమంలో ఇదంతా అధికార పార్టీ అడిస్తున్న డ్రామాగా కొట్టిపారేసిన కాంగ్రెస్.. తన మాటల నుంచి యూటార్న్ తీసుకుంది.

పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్ర విభజనను చేసి అంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టడంతో పాటు టీడీపీ నేతలకు ఇచ్చిన మాటను కూడా నిలుపుకునేందుకు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ సన్నధమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని రాష్ట్ర విభజన చట్టం సమయంలో పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేసినా.. దానిని అమలు చేయడంలో మోడీ సర్కార్ వెనుకంట వేసిందని అరోపించిన కాంగ్రెస్.. తలుపులు మూసింది కనబడింది కానీ, మన్మోహన్ మాటలు మాత్రం వినిపించలేదా.? అని ప్రశ్నించింది.

దీంతో ఇవాళ ఉదయమే టీడీపీ ఎంపీలతో లోక్ సభలో మంతనాలు జరపిన సోనియాగాంధీ రాష్ట్ర పరిస్థితులు, ప్యాకేజీ విషయాలను తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితిపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితి గురించి ఆమెకు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, పి.రవీంద్రబాబులు వివరించారు. ఈ ఘటన సభలో ఉన్నవారి దృష్టిని ఆకర్షించింది. దీంతో గత నాలుగు రోజులుగా టీడీపీ ఎంపీల ఆందోళనలపై స్పందించని కాంగ్రెస్... ఇవాళ రూటు మార్చింది.

ఏపీకి మద్దతిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలంటూ లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నోటీసును ఇచ్చింది. రూల్ 184 కింద ఏపీకి స్పెషల్ స్టేటస్ పై చర్చతో పాటు ఓటింగ్ జరపాలంటూ లోక్ సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే నోటీసులు అందించారు. టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఏపీ కోసం పోరాడతామని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇవ్వడం గమనార్హం. కాగా, సోనియా మాటఇస్తే ఎంత కష్టమైనా, నష్టమైనా మాటను నిలుపుకుంటారన్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో రుజువైందని పలువురు నేతలు కూడా చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia Gandhi  TDP MPs  Kesineni Nani  Ram Mohan Naidu  Thota Narasimham  issues of AP  parliament  

Other Articles