Pawan Kalyan responds on Union Budget రాష్ట్రాభివృద్దికి దోహదపడతారనే టీడీపీ, బీజేపీలకు మద్దతు

Pawan kalyan responds on union budget 2018 and ap special status

Pawan Kalyan Press meet, Pawan Kalyan Union budger, Pawan Kalyan special package, pawan kalyan special status, pawan kalyan janasena, pawan kalyan, union budget, chandrababu, BJP, TDP, andhra pradesh, politics

It’s my mistake not to bring high voice for Janasena by not getting few seats in the previous election. Play cards and Slogans in Parliament wont work at all says jana sena chief presideng pawan kalyam

ITEMVIDEOS: రాష్ట్రాభివృద్దికి దోహదపడతారనే టీడీపీ, బీజేపీలకు మద్దతు: పవన్

Posted: 02/07/2018 06:01 PM IST
Pawan kalyan responds on union budget 2018 and ap special status

రాష్ట్ర విభ‌జ‌నతో తీవ్ర అన్యాయానికి గురైన అంధ్రప్రదేశ్ కు న్యాయం జరుగుతుందని అశించి, న్యాయం చేస్తారని అక్కడ బిజేపి, ఇక్కడ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశానని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ అన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో యూపీఏ ప్ర‌భుత్వం ఏపీకి న్యాయం చేయ‌లేద‌న్న కారణంతో.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చుతార‌ని, అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం ఉన్న న‌రేంద్ర‌ మోదీ, చంద్ర‌బాబు నాయుడుల‌ను స‌మ‌ర్థించాన‌ని చెప్పారు.

అయితే నాలుగేళ్లు గడుస్తున్నా విభజన చ‌ట్టం హామీల అమ‌లుపై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భిన్న వాద‌న‌లు చెబుతున్నాయ‌ని, ఇందులో కొన్ని అబద్దాలు కూడా వున్నాయని పవన్ కల్యాన్ విమర్శించారు. ఎన్నిక కాగానే వెంటపడితే బాగోదని, ప్ర‌భుత్వాలు ఏర్ప‌డిన తరువాత ఏడాదిన్న‌ర కాలం ఎంతో సంయమనంతో వున్నానని, ఆ త‌రువాత కూడా ప్ర‌త్యేక హోదా గురించి ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెలుసుకున్నాన‌ని తెలిపారు. దీంతో ప్రత్యేక హోదాపై తాను గళమిప్పానని చెప్పారు.

తిరుప‌తి, కాకినాడల్లో స‌భ‌ల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించానని ఆ తరువాత కొన్ని రోజులకు ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని అన్నారని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రానికి అధిక లాభమని తొలుత వాదించిన టీడీపీ నేత‌లు.. కాలం గడుస్తున్న కొద్ది ఒక‌సారి బాగుందంటారు, ఒక‌సారి బాగోలేద‌ని అంటారని విమ‌ర్శించారు. ఇలా మాట‌ల‌తో చాలా తిక‌మ‌క చేస్తున్నారని, రాష్ట్ర ప్ర‌భుత్వం మీద న‌మ్మ‌కం పోతోందని చెప్పారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏయే హామీలు ఇచ్చారో అవేవీ చేయ‌డం లేదని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీల‌ను ఎందుకు అమ‌లు చేయడం లేదని ప్ర‌శ్నించారు. 

కేంద్ర బడ్జెట్ లో ఏపీ వాటా ఎంత.?

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రూ.24 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? అని పవన్ కల్యాన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులపై కూడా స్పష్టత లేదని విమర్శించారు. నవ్యాంధ్రప్రదేశ్ గురించి సరిగ్గా పట్టించుకోలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటుకు రాజకీయ జేఏసీ ఏర్పడినట్లుగా అంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక హోదా కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమించాల్సిన అవసరం వుందని అన్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు. హామీలను విస్మరించడం పాలకులకు సముచితం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంపై వుందని పవన్ అన్నారు. కానీ ఇప్పటికీ చట్టంలోని అనేక హామీలు అమలుకావడం లేదని పవన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  union budget  chandrababu  BJP  TDP  andhra pradesh  politics  

Other Articles