actress shruthi cheated even Bengaluru Man ఈజీ మని, విలాసాలు.. నటి జీవితం జైలు పాలు..

Another case filed against tamil actress shruthi for cheating bengaluru man

Shruthi, Kollywood, santosh kumar, techie, bangalore, Germany, Balamurugan, tamil actress, nri, wedding, crime

coimbatore police had submitted another case against Young tamil actress shruthi, as in the nri balamurugan case, she also cheated a Bengaluru software engineer santosh kumar, after veritfying the proofs he approched police.

ఈజీ మని, విలాసాలు.. నటి జీవితం జైలు పాలు..

Posted: 02/02/2018 12:43 PM IST
Another case filed against tamil actress shruthi for cheating bengaluru man

ఈజీ మనీ కోసం.. ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బును కొట్టేస్తే.. కటకటాలపాలవుతామని తెలిసినా కొందరు సులభమైన మార్గమని, తాత్కాలిక సుఖం కోసం అదే మార్గాన్ని ఎంచుకుని చివరకు తనవారికి దూరంగా కారాగారవాసం అనుభవించాల్సి వస్తుంది. నటిగా కొన్ని చిత్రాలలో నటించి.. అవకాశాలు లేక అవసరాల కోసం ఈజీ మనీ కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్న ఈ నటి.. కోట్లకు పడగలెత్తాలని అశించింది.. కానీ చివరకు కటకటాపాలైంది.

తన అవసరాలకు డబ్బును పంపిస్తూ, ఎక్కడో దూరన వున్న ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన తమిళ వర్థమాన సినీ నటి శ్రుతి మోసానికి పాల్పడింది. తమిళనాడులోని సేలంకు చెందిన ఎన్నారై జి.బాలమరుగన్, జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మ్యాట్రిమెనియల్ వెబ్ సైట్ లో అతన్ని పరిచయం చేసుకున్న శ్రుతి అతడ్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.

తన తల్లికి అనారోగ్యమని, తనకు కూడా అనారోగ్యమని చెప్పి అతడి వద్ద నుంచి ఏకంగా రూ.41 లక్షలను నొక్కేసింది. ఆ తరువాత అతనితో మాట్లాడటమే మానేసింది. అనుమానం వచ్చిన బాలమరుగన్ పోలీసులను అశ్రయించడంతో వారు అమెపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. దీంతో నటి శ్రుతిని కొర్టు అదేశాలతో పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఇదంతా మాకు తెలిసిన కథేగానీ ఇప్పుడు మళ్లీ ఎందుకని శ్రుతి గురించి చెబుతున్నారు అని అంటరా..? అక్కడికే వస్తున్నాం.

నటి శ్రుతిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త తెలుసుకున్న మరో కర్ణాటకవాసి.. పరువు కోసం అప్పట్లో భయపడి మిన్నకుండిపోయినా.. తాజాగా మాత్రం అమెపై మరో కేసును నమోదు చేశాడు. మూడేళ్ల క్రితమే తనను కూడా శ్రుతి మోసం చేసి రూ. 40 లక్షలకు పైగా తీసుకుందని, పరువుపోతుందని అప్పట్లో ఫిర్యాదు చేయలేదని బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు.

అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు శ్రుతికి వెళ్లినట్టుగా సాక్ష్యాలు ఉండటంతో కోయంబత్తూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఆమెను విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు తీసుకురాగా, తాజా కేసులో ఆరోపణల పత్రాలను కోర్టుకు అందించారు. శ్రుతి బారిన పడిన వారు ఇంకా చాలా మంది ఉండివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విచారణ అనంతరం ఆమెను తిరిగి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi  Kollywood  santosh kumar  techie  bangalore  Germany  Balamurugan  tamil actress  nri  wedding  crime  

Other Articles