oman stops issuing expat visas పది రంగాల్లోని ఉద్యోగాలపై ఒమన్ వీసాలు నిషేధం..

Ministry bans visa for expats in ten sectors

expat visas, Fabio Scacciavillani, Oman, Omanisation, Sheikh Abdullah bin Nasser Al Bakri, 87 feilds, 10 sectors, expat workers

The Gulf country of Oman announced a six-month ban on visas for expats from 10 industries, as part of what it said was an effort to encourage companies to hire more Omani nationals.

ఉద్యోగాలపై ఒమన్ నిషేధం.. తెలుగుప్రజలకు శాపం..

Posted: 01/31/2018 12:23 PM IST
Ministry bans visa for expats in ten sectors

ప్రపంచం మీ గుప్పిట్లో అన్నట్లుగా మారిన నేటి పరిణామాల నేపథ్యంలో ఏదేశమోగినా.. మన భారతీయులు ఘనకీర్తిని చాటుతూ వుంటారు. ఇలా దేశస్థులు విదేశాలకు వలసలు వెళ్లి పేరుప్రఖ్యాతులు అర్జించడం అహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఇటీవల కాలంలో అమెరికా అతరువాత అస్ట్రేలియి భారతీయుల వలసలకు బ్రేక్ వేసింది. ఆ తరువాత కాలానుగూణంగా వాటిని ఎత్తివేసింది. ఈ క్రమంలో తాజాగా మరో దేశం కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ నిర్ణయం వల్ల అధికంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు శాపంగా పరిణమించింది. ఎందుకంటే ఈ దేశానికి అధికంగా వలసవెళ్లే వారిలో తెలుగువారు వున్నారు. ఆ దేశం మరేదో కాదు గల్స్ దేశాల్లో ఒకటైన ఒమన్. మెరుగైన వేతనం కోసం వీరంతా ఎడారి దేశానికి క్యూ కడుతున్న క్రమంలో అక్కడి పాలకులు తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగుప్రజల అశలు అవిరిచేస్తున్నాయి. తమ దేశంలో మొత్తంగా 87 రకాల ఉద్యోగ వీసాలపై నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అరు మాసాల పాటు ఈ నిషేదం అమల్లో వుండనుంది.

ఇప్పటికే ఈ నిషేధం అమల్లోకి రాగా, అసలు నిషేదం విధించడానికి కారణాలను అన్వేషిస్తే.. స్వదేశంలో నిరుద్యోగం పెరుగుతుండటం, విదేశాల నుంచి వలసలు ఎక్కువ కావడమేనని తెలిసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒమన్ పాలకులు తాజాగా 87 ఉద్యోగాలపై నిషేధాన్ని విధించారు. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలపై అధికంగా పడింది. లక్షలాది మంది తెలుగువారు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు.

వలసలు పెరగడంతో.. స్థానికంగా నిరుద్యోగ సమస్య ఉత్పన్నమైంది. వారికి ఉద్యోగలు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో, కీలకమైన ఉద్యోగాలు స్థానికులకే చెందాలంటూ అక్కడి యువత డిమాండ్ చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం.. కీలక ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా... అన్ని సంస్థల్లో ఎక్కువ శాతం స్వదేశీయులే ఉండేలా నిబంధనలు రూపొందించింది. పది మంది పని చేసే చిన్న హోటల్ లో కూడా కనీసం ఆరుగురు స్వదేశస్తులు ఉంటేనే అనుమతులు ఇస్తోంది.

వీసాలు నిషేధించిన రంగాలు ఇవే:
మెడికల్, మార్కెటింగ్, సేల్స్, హెచ్ఆర్, ఇన్స్యూరెన్స్, ఎయిర్ పోర్ట్, ఇంజినీరింగ్, టెక్నికల్, ఐటీ, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మీడియా రంగాల్లోన్ని 87 రకాల ఉద్యోగాలు. అయితే ప్రస్తుతం అరు మాసాల పాటు వున్న ఈ నిషేధాన్ని ఏడాది నుంచి మూడేళ్ల వరకు పొడిగించే అవకాశాన్ని కూడా అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles