Pawan kalyan Interacts with Handloom Workers ధర్మవరం చేనేతకు బ్రాండ్ ఇమేజ్ పెంచుతా: పవన్

Pawan kalyan interacts with handloom workers at dharmavaram

Pawan Kalyan Political Yatra, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Puttaparthi, pawan kalyan anathapur, pawan kalyan Dharmavaram, pawan kalyan sathya sai samadhi, janasena, pawan kalyan, Dharmavaram, andhra pradesh, politics

Actor turned politician, Jana sena chief power star pawan kalyan has reached Dharmavaram and interacted with Handloom workers. The workers said they are getting Rs 50,000 govt funds to each worker under Mudra Scheme which is not sufficient.

ITEMVIDEOS: నేతన్నకు అండ..సమస్యకు మానిఫెస్టోలో స్థానం: పవన్

Posted: 01/29/2018 12:35 PM IST
Pawan kalyan interacts with handloom workers at dharmavaram

అనంతపురం జిల్లా చివరి రోజు పర్యటనలో జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ బిజీబిజీగా గడుపుతున్నారు. చేనేతలకు బ్రాండ్ ఇమేజ్ పెంచేలా తన కార్యక్రమాలు వుంటాయన్న పవన్.. ధర్మవరానికి చేనేత బ్రాండ్ ను తెచ్చే బాధ్యత తనదేనని ప్రకటించారు. చేనేత కార్మికులకు చేనేతలకు అండగా ఉంటుందని అన్నారు.

తాను మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధిగా చేనేత సమస్యలను తెలుసుకోవడం కోసమే ధర్మవరానికి వచ్చానని అందుకనే వారితో స్రత్యేకంగా చర్చలు నిర్వహించానని చెప్పారు. నేతన్న కన్నీరు తుడిచి, వారికి అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు. విదేశాల్లో వృత్తి కళాకారులకు ప్రాధాన్యత ఎంతో ఉందని, విదేశాల నుంచి డిజైన్లు తెచ్చి, వాటిని ఇక్కడ నేయాలని సూచించారు.

తర తొలి దశ రాజకీయ పర్యటనలో ప్రజాసమస్యలను తెలుసుకన్నానని చెప్పారు. అన్ని సమస్యల పరిష్కారాలనూ తన మేనిఫెస్టోలో చేరుస్తానని అన్నారు. అందుకు తనకు కొద్ది రోజుల సమయం కావాలని, పవర్ లూమ్స్ కు తాను వ్యతిరేకిని కాదని, వాటివల్ల కార్మికులు, చేనేత కళాకారుల వృత్తి నైపుణ్యం అంతరించి పోకుండా చూడాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు సమస్యలు ఎక్కడ ఉన్నాయో తనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.

అభిమానుల అత్యుత్సాహం, స్పీడ్ చూస్తుంటే తనకు చాలా భయంగా ఉందని పవన్ కల్యాన్ వ్యాఖ్యానించారు. పవన్ అనంత పర్యటనలో స్వాగతం పలికేందుకు వచ్చి ఓ అభిమాని తన కాన్వాయ్ కిందపడి గాయపడటం, విషయం తెలుసుకున్న తాను వెంటనే తన పార్టీ నేతలతో అస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించానని చెప్పారు. ఈ తరహా చర్యలు వద్దని, వీటి వల్ల తనకు భయంగా వుందని పవన్ అందోళన వ్యక్తం చేశారు.  

అభిమానులు నలిగిపోతారనూ తాను సినిమా ఫంక్షన్స్ ఎక్కువగా జరుపుకోనని, వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. అయితే రాజకీయ క్షేత్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే కానీ, ప్రజా సమస్యలను తెలుసుకోలేమని అన్నారు. రాజకీయ పార్టీ స్థాపన తరువాత ప్రజా సమస్యల అవగాహన కోసం ప్రజల్లోకి రాక తప్పదని, అయితే ఇలా వచ్చిన క్రమంలో అభిమానులు ఇబ్బందులకు గురి కావడం తనను కలిచివేస్తుందని చెప్పారు.

కోట్ల మంది ప్రజల సమస్యలను ఇంట్లో కూర్చుంటే తెలుసుకోలేనని చెప్పిన పవన్ కల్యాణ్, తాను కూడా కొంత నలగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అభిమానులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని, వారి తరువాతే అభిమాన హీరో అనుకోవాలని హితవు పలికారు. వేగంగా, అత్యుత్సాహంతో రావద్దని, సంతోషంగా, నెమ్మదిగా రావాలని పిలుపునిచ్చారు. ఎవరికి ఏమైనా ఓ అన్నగా తనకు బాధ కలుగుతుందని, తనకు ఎటువంటి వేదనను కలిగించవద్దని వేడుకుంటున్నానని చెప్పారు.

గడచిన పది రోజులుగా మాట్లాడి, మాట్లాడి తన గొంతు ఎండుకుపోయిందని పవన్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం ధర్మవరం చేరుకున్న ఆయన చేనేత కార్మికులతో సమావేశమై ప్రసంగించారు. తన గొంతు నుంచి రక్తం వచ్చేంత దగ్గుతున్నానని కూడా పవన్ చెప్పారు. ఇక ప్రసంగిస్తున్నంత పేపు పవన్ కల్యాణ్ కు పలుమార్లు దగ్గు రాగా, జనసేన కార్యకర్తలు మంచినీళ్లు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ananthapur  Dharmavaram  handloom weavers  andhra pradesh  politics  

Other Articles