Two dead, 17 wounded in Kentucky high school shooting అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

Kentucky school shootout 2 killed 17 injured in the us

marshall county, marshall county high school, kentucky school shooting, kentucky school shooting today, marshall county ky, marshall county kentucky, marshall county school shooting

A 15-year-old student killed two classmates and hit a dozen others with gunfire Tuesday at his rural Kentucky high school. Dusty Kornbacher was in her florist shop when she saw all the police activity outside her window.

ITEMVIDEOS: అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి

Posted: 01/24/2018 09:42 AM IST
Kentucky school shootout 2 killed 17 injured in the us

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు గన్ కల్చర్ చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో మరో మారు కాల్పుల కలకలం రేగింది. ఓ విద్యార్థి పాఠశాలకు గన్ పట్టుకుని వచ్చి విఛక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు సహచర విద్యార్థులు మరణించగా, 17 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏక్కడ ఏప్పుడు ఏలాంటి వార్తలు వినాల్సివస్తుందోనని బీతిల్లిపోతున్న అగ్రరాజ్యవాసులు..ఇవాళ ఉదయం తమ చిన్నారులు చదువుకునే పాఠశాలలో కాల్పలు జరిగాయన్న వార్త వారిని తీవ్ర అందోళనకు గురిచేసింది.

కాల్పలు సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భయాందోళనతో మరికొందరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. కెంటుకీ శివార్లలోని బెన్టన్ మార్షక్ కౌంటీ హై స్కూల్ లో ఓ 15 ఏళ్ల విద్యార్థి తనతో పాటు గన్ ను తీసుకువచ్చి. కాల్పులు జరిపాడు. ఈ కాల్పలులో బైయిలీ హాల్ట్, ప్రెస్టన్ కోప్ అనే ఇద్దరు 15 ఏళ్ల విద్యార్థులు మరణించారు. బెయిలీ ఘటనాస్థలంలోనే మరణించగా, కోప్ మాత్రం నాష్ విల్లీ అస్పత్రికి తరలించిన అనంతరం అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

తోటి విద్యార్థులు తనను గేలి చేశారన్న అసూయతో రగిలిపోయిన విద్యార్థి ఈ కాల్పులకు పాల్పడ్డాడా..? లేక పాఠశాల ఉపాద్యాయులు అవమానించారని గన్ తీసుకువచ్చి కాల్పలు జరిపాడా..? అసలు కాల్పులు జరపడానికి విద్యార్థిని ప్రేరేపించిన కారణాలు ఏమిటన్నదన్ని మాత్రం తెలియలేదు. కాగా ఇది అత్యంత దరదృష్టకరమైన ఘటన అని కాల్పలు జరిపిన విద్యార్థినిన పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కెంటుకీ గవర్నర్ మట్ బెవిన్ ఓ ప్రకటనలో తెలిపారు.

అయితే అందిన సమాచారం మేరకు ఒక విద్యార్థి మాత్రమే ఘటనాస్థలంలో మరణించాడని, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థిని ఎయిర్ లిప్ట్ ద్వారా నగరంలోని మరో అస్పత్రిలో చేర్పించామని చెప్పారు. ఇక కాల్పలులో క్షతగాత్రులై మరో 16 మందిని కూడా అస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించామని చెప్పారు. ఘటనాస్థలానికి చేరకున్న సిబ్బందికి అందరూ సహకరించాలని అయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles